వాటర్‌ ట్యాంక్‌ ఎక్కిన గిరిజనుడు | - | Sakshi
Sakshi News home page

వాటర్‌ ట్యాంక్‌ ఎక్కిన గిరిజనుడు

Aug 14 2025 7:10 AM | Updated on Aug 14 2025 7:10 AM

వాటర్

వాటర్‌ ట్యాంక్‌ ఎక్కిన గిరిజనుడు

అశ్వారావుపేటరూరల్‌: తనకు అర్హత ఉన్నా ప్ర భుత్వం, అధికా రులు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయలేదని ఆగ్రహించిన ఓ గిరిజనుడు వాటర్‌ ట్యాంక్‌ ఎక్కిన ఘటన బుధవా రం మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని మామిళ్లవారిగూడెం గ్రామ పంచాయతీ ఊసిర్లగూడేనికి చెందిన జెట్టి మోహన్‌రావు.. అధికారులు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయలేదని, మద్యం సేవించి మత్తులో మిషన్‌ భగీరథ ట్యాంక్‌పైకి ఎక్కాడు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయకపోతే ట్యాంక్‌ పైనుంచి కిందకు దూకేస్తానని బెదిరించాడు. దాదాపు గంటపాటు హల్‌చల్‌ చేశాడు. స్థానికులు గమనించి మోహన్‌రావుకు సర్దిజెప్పారు. పోలీసులు ఘటనా స్థలానికి చేకునే సమయానికి మోహన్‌రావు కిందికి దిగా డు. పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకొని వివరాలు సేకరిస్తున్నారు.

పోగొట్టుకున్న

సెల్‌ఫోన్ల అప్పగింత

కొత్తగూడెంటౌన్‌: సెల్‌ఫోన్‌లు పోగొట్టుకున్న తొమ్మిది మందికి కొత్తగూడెం వన్‌టౌన్‌ సీఐ ఎం.కరుణాకర్‌ బుధవారం తిరిగి అప్పగించా రు. సీఐ మాట్లాడుతూ.. కొత్తగూడెం పట్టణ పరిధిలోని పోస్టాఫీస్‌, బస్టాండ్‌, సింగరేణి ప్రధాన కార్యాలయాల ప్రాంతాల్లో సెల్‌ఫోన్లు పోగొట్టుకున్నవారు ఫిర్యాదు చేయగా.. సెల్‌ఫోన్‌లను గుర్తించి తిరిగి అందించామని చెప్పారు.

సీఆర్‌పీఎఫ్‌ ఆధ్వర్యంలో ‘హర్‌ ఘర్‌ తిరంగా’

చర్ల: మండలంలోని సత్యనారాయణపురంలోని సీఆర్‌పీఎఫ్‌ 81 బెటాలియన్‌ కమాండెంట్‌ ముకేశ్‌కుమార్‌ సింగ్‌ ఆదేశాల మేరకు బుధవారం హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమాల్లో భాగంగా చర్ల మండలంలోని పూసుగుప్ప, ఉంజుపల్లి, చెన్నాపురం, సత్యనారాయణపురం సీఆర్‌పీఎఫ్‌ క్యాంపుల సమీప గ్రామాల్లో జాతీయ జెండాలతో ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటుచేసిన కార్యాక్రమాల్లో కమాండెంట్‌ ముకేశ్‌కుమార్‌సింగ్‌, డిప్యూటీ కమాండెంట్‌ రవిశంకర్‌శర్మ, రాజేశ్‌గోడ్రా, ఇన్‌స్పెక్టర్‌ కృష్ణకుమార్‌సింగ్‌ మాట్లాడారు.

గురాయ్‌తోగులో

పెద్దపులి పాదముద్రలు..!

కొత్తగూడ రేంజ్‌ నుంచి

వస్తున్న పులి: రేంజర్‌

కరకగూడెం: కొంతకాలంగా స్తబ్ధుగా ఉన్న పెద్దపులి సంచారం తాజాగా వెలుగులోకి వచ్చింది. బుధవారం కరకగూడెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన మేకలను అటవీ ప్రాంతానికి తీసుకెళ్తున్న క్రమంలో గురాయ్‌తోగు వద్ద పెద్దపులి పాదముద్రలను గమనించాడు. భయంతో వెంటనే మేకలతో సహా ఇంటికి తిరిగి వచ్చాడు. ఈ విషయమై ఏడూళ్లబయ్యారం రేంజర్‌ తేజస్విణిని వివరణ కోరగా.. కొత్తగూడ రేంజ్‌ నుంచి పెద్దపులి వస్తున్నదని, రెండు రోజులుగా మండలంలోని పలు అటవీ ప్రాంతాల్లో పులి కోసం సిబ్బందితో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నామని, ఇప్పటివరకు ఎక్కడా దాని పాదముద్రలు కనిపించలేదని వివరించారు. లింగాల రేంజ్‌లో పులి సంచరిస్తున్నదని ఇటువైపు కూడా వచ్చే అవకాశం ఉందని, అటవీ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. కాగా, పెద్దపులి సంచారంపై స్థానికుల్లో ఆందోళన నెలకొంది. భారీ వర్షాల నేపథ్యంలో ఫారెస్ట్‌ సిబ్బందికి గాలింపు చర్యలు పెనుసవాల్‌గా మారాయి.

హోంగార్డుకు

తీవ్ర గాయాలు

తిరుమలాయపాలెం: తిరుమలాయపాలెం పెట్రోల్‌బంక్‌ సమీపాన జరిగిన రోడ్డు ప్రమాదంతో హోంగార్డుకు తీవ్రగాయాలయ్యాయి. గోల్‌తండాకు చెందిన ఉపేంద్రయ్య(ఉపేందర్‌) హోంగార్డు(డ్రైవర్‌)గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆయన బుధవారం రాత్రి బైక్‌పై వెళ్తుండగా పెట్రోల్‌ బంక్‌ సమీపాన కింద పడడంతో తలకు బలమైన గాయమైంది. దీంతో సీహెచ్‌సీలో చికిత్స అనంతరం ఖమ్మంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు.

వాటర్‌ ట్యాంక్‌  ఎక్కిన గిరిజనుడు1
1/2

వాటర్‌ ట్యాంక్‌ ఎక్కిన గిరిజనుడు

వాటర్‌ ట్యాంక్‌  ఎక్కిన గిరిజనుడు2
2/2

వాటర్‌ ట్యాంక్‌ ఎక్కిన గిరిజనుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement