
జవాన్ అనిల్‌కు కన్నీటి వీడ్కోలు
● సైనిక లాంఛనాలతో స్వగ్రామంలో అంత్యక్రియలు ● కి.మీ. మేర జాతీయ జెండాలతో ర్యాలీ
●నాన్న వచ్చాడురా...
వేలాదిగా తరలివచ్చిన జనసందోహం నడుమ సూర్యతండాలోని స్వగృహానికి అనిల్ మృతదేహాన్ని తీసుకురాగనాఏ ఆయన తల్లి ద్వాలీ, భార్య రేణుక కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. ‘దేశ రక్షణ కోసం వెళ్లి ఇలా తిరిగి వచ్చావా’ అంటూ ఆయన తల్లి చేసిన రోదనలు అందరినీ కంట తడి పెట్టించాయి. అలాగే, ‘మీ నాన్న వచ్చాడురా.. చిన్నా!’ అంటూ అనిల్ కుమారుడికి తండ్రి మృతదేహాన్ని చూపిస్తూ రేణుక కన్నీరుమున్నీరవడం అక్కడి వారందరినీ కంటతడి పెట్టించింది.
కారేపల్లి: కాశ్మీర్ లోయలో జరిగిన ప్రమాదంలో కన్నుమూసిన ఆర్మీ జవాన్ బానోతు అనిల్‌కుమార్‌కు కుటుంబీకులు, స్థానికులు బుధవారం వీడ్కోలు పలికారు. జై జవాన్, అమరహే అనిల్‌కుమార్ అంటూ నినాదాల నడుమ విద్యార్థులు, యువత, స్థానికులు ఆయన మృతదేహం వద్ద నివాళులర్పించారు. ఈనెల 11వ తేదీన కాశ్మీర్‌లో జరిగిన ప్రమాదంలో కారేపల్లి మండలం సూర్యతండా గ్రామానికి చెందిన బానోతు అనిల్‌కుమార్ మృతి చెందిన విషయం విదితమే. ఆయన మృతదేహాన్ని హైదరాబాద్‌కు అక్కడి నుంచి అక్కడి నుంచి బుధవారం ఉదయం ప్రత్యేక వాహనంలో కామేపల్లి కామేపల్లి పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఈక్రమాన ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అనిల్ మృతదేహం నివాళులర్పించారు. అనంతరం కారేపల్లి క్రాస్‌లో వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్‌నాయక్ నివాళులర్పించి అంతిమయాత్రలో పాల్గొన్నారు.
భారీగా హాజరైన జనం
కారేపల్లి క్రాస్ వద్దకు అనిల్ మృతదేహంతో కూడిన వాహనం చేరేసరికి యువకులు, విద్యార్థులు, స్థానికులు జాతీయ జెండాలో వేచి ఉన్నారు. ఆపై ఆయన మృతదేహం ఉన్న మిలటరీ వాహనాన్ని ఏడు కి.మీ. అనుసరిస్తూ స్వగ్రామానికి చేరారు. ఆపై అనిల్ మృతదేహాన్ని ఆయన స్వగ్రామానికి తీసుకొచ్చి నివాళులర్పించాక వ్యవసాయ పొలం తీసుకెళ్లారు. అక్కడ సైనిక అధికారులు గౌరవ వందనం సమర్పించి మూడు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపారు. ఆపై అనిల్ అంత్యక్రియలు పూర్తిచేశారు. మాజీ ఎమ్మెల్యేలు లావుడ్యా రాములునాయక్, బానోతు చంద్రావతి, మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్ సతీమణి మంజుల పాల్గొన్నారు.

జవాన్ అనిల్‌కు కన్నీటి వీడ్కోలు