
గుండెపోటుతో మృతి
మణుగూరుటౌన్: సీపీఐ రాష్ట్ర నాయకుడు బొల్లోజు అయోధ్యచారి మృతిని జీర్ణించుకోలేక సాంబాయిగూడెంనకు చెందిన తన అభిమాని గురువారం రాత్రి గుండెపోటుతో మృతిచెందాడు. స్థానికులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మండలంలోని సాంబాయిగూడెం గ్రామానికి చెందిన రాచకొండ శంకర్ అలియాస్ చక్రయ (43) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అయోధ్య అంటే ఎనలేని అభిమానం. అయోధ్య అంతిమయాత్రలో పాల్గొన్నాడు. కార్యక్రమం అనంతరం ఇంటికి వెళ్లగా గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
బైక్ దొంగ అరెస్ట్
భద్రాచలంఅర్బన్: భద్రాచలంటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇటీవల చోరీ లకు గురైన ఐదు ద్విచక్ర వాహనాల ను పోలీసులు స్వాధీనం చేసుకుని, చోరీచేసిన నిందితుడైన బూర్గంపాడు మండలం సారపాక జీపీ గాంధీనగర్‌కు చెందిన గుగులోత్ శ్రీనును శుక్రవారం అరెస్ట్ చేశారు. భద్రాచలంటౌన్ సీఐనాగరాజు కథ నం ప్రకారం.. భద్రాచలం పట్టణంలో వాహనాల తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా.. బైక్‌ల చోరీ విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడిపై గతంలో నాలుగు కేసులు ఉన్నాయని, రిమాండ్‌కు తరలించామని సీఐ నాగరాజు వివరించారు.
పాత సంతకాలతో నోటరీలు?
ఖమ్మంక్రైం: కార్పొరేషన్ కార్యాలయం సమీపాన ఓ మహిళ నిర్వహిస్తున్న జిరాక్స్, ఆన్‌లైన్ సెంటర్‌లో శుక్రవారం రాత్రి టూటౌన్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు తనిఖీ చేపట్టారు. నోటరీ కోసం వచ్చే వారిని విచారించకుండానే పాత సంతకాలతో కూడిన పత్రాలు విక్రయిస్తుందనే ఫిర్యాదులు అందాయని సమాచారం. దీంతో తనిఖీ చేపట్టి 36 నోటరీలను స్వాధీనం చేసుకున్నామని సీఐ బాలకృష్ణ తెలిపారు.

గుండెపోటుతో మృతి