మలేరియాను తరిమికొట్టాలి..
ఇల్లెందు: మలేరియా నివారణ కోసం ముందస్తు చర్యలు ముమ్మరం చేశారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 20 కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించిన వారి వల్ల వ్యాప్తి చెందినట్లు గుర్తించారు. జిల్లావ్యాప్తంగా మలేరియా వ్యాధి లక్షణాలు కలిగిన వారిని గుర్తించే సర్వే పూర్తి చేశారు. జ్వర పీడితుల నుంచి రక్తపూతలు సేకరించి పరీక్షించారు. గొత్తికోయగూడేల్లో ఉన్న వారే ఈ జ్వర పీడితులుగా తేలారు. వీరు తమ స్వగ్రామాలకు వెళ్లి తిరిగి వచ్చిన వారి నుంచి మలేరియా సోకినట్లు గుర్తించారు. వారికి ప్రత్యేక వైద్యం అందిస్తున్నారు. వచ్చే నెల 16 నుంచి మలేరియా నివారణ కోసం మందు పిచికారీ చేయించేందుకు ప్రణాళిక రూపొందించారు.
ఏడు మలేరియా సబ్ యూనిట్లు..
జిల్లాలో ఏడు మలేరియా సబ్ యూనిట్ సెంటర్లు ఉన్నాయి. ఒక్కో సెంటర్‌కు ఒక సబ్ యూనిట్ సూపర్‌వైజర్ పనిచేస్తున్నారు. జిల్లాలో మలేరియా ప్రోగ్రాం ఆఫీసర్ కార్యక్రమం రూపొందించి సబ్‌యూనిట్లకు చేరవేస్తారు. మలేరియా సబ్‌యూనిట్ సూపర్‌వైజర్ ద్వారా కిందిస్థాయిలోమలేరియా నివారణ కార్యక్రమాలు అమలుచేస్తున్నారు. ఇల్లెందు యూనిట్ పరిధిలోసులానగర్(టేకులపల్లి), ఆళ్లపల్లి, రొంపేడు(సుదిమళ్ల), గుండాల పీహెచ్‌సీలు ఉన్నాయి.కొత్తగూడెం సబ్ యూనిట్ పరిధిలో కొత్తగూడెం, పెనగడప, సుజాతనగర్, చండ్రుగొండ, జూలూరుపాడు, ఎర్రగుంట, ఎంపీ బంజర సబ్ యూనిట్ పరిధిలో ఉల్వనూరు, ముల్కలపల్లి, పాల్వంచ, జగన్నాథపురం, ఎంపీ బంజర,అశ్వారావుపేట సబ్ యూనిట్ పరిధిలో వినాయకపురం, గుమ్మడివల్లి, దమ్మపేట, పట్వారీగూడెం, మణుగూరు సబ్ యూనిట్ పరిధిలోమణుగూరు, అశ్వాపురం, పినపాక, జానపేట, కరకగూడెం, భద్రాచటం సబ్ యూనిట్‌పరిధిలో భద్రాచలంటౌన్, నర్సాపురం,పర్ణశాల, దుమ్ముగూడెం, చర్ల పీహెచ్‌సీలు ఉండగా వీటి పరిధిలో 20 కేసులు నమోదయ్యాయి.
ఇప్పటికే 20 కేసుల గుర్తింపు
రాకపోకల వల్లే వ్యాధి వ్యాప్తి
ముందస్తు చర్యలతోనే నివారణ
మలేరియా నివారణకు చర్యలు..
జిల్లాలో మలేరియా నిర్మూలన కోసం ప్రణాళికాయుతంగా చర్యలు చేపడతున్నాం. ఇప్పటికే గ్రామస్థాయిలో రక్తపూత లు సేకరించి పరీక్షించగా 20 కేసులు నమోదయ్యాయి. వారందరికీ వైద్యం అంది స్తున్నాం. ప్రస్తుతం మలేరియా అదుపులో ఉంది. నివారణకు తగు చర్యలు ముమ్మరం చేశాం.
–డాక్టర్ స్పందన, మలేరియా ప్రోగ్రాం అధికారి
మలేరియాను తరిమికొట్టాలి..


