2న హ్యాండ్‌బాల్ జట్ల ఎంపిక పోటీలు
ఖమ్మం స్పోర్ట్స్: ఉమ్మడి జిల్లాస్థాయి జూనియర్ బాలబాలికల జట్ల ఎంపికకు జూన్ 2న పోటీలు నిర్వహిస్తున్నట్లు హ్యాండ్‌బాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి డాక్టర్ పి.రఘునందన్ తెలిపారు. ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఈ పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. క్రీడాకారులు వయసు ధ్రువీకరణ పత్రంతో పాటు ఆధార్ కార్డుతో ఉదయం 10 గంటలకల్లా రిపోర్టు చేయాలని సూచించారు.
ఏళ్లుగా ఉద్యోగ,
ఉపాధ్యాయులకు నిరాశే..
ఖమ్మం సహకారనగర్: తెలంగాణ ఏర్పడితే నిరుద్యోగ, ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారమవుతాయని భావిస్తే 11ఏళ్లుగా నిరాశే మిగిలిందని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్(టీపీటీఎఫ్) రాష్ట్ర వ్యవస్థాపక కార్యదర్శి మనోహర్‌రాజు పేర్కొన్నారు. యూనియన్ 12వ ఆవిర్భావ వేడుకలను ఖమ్మంలోని కార్యాలయం వద్ద గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా జెండా ఆవిష్కరించిన మనోహర్‌రాజు మాట్లాడుతూ తమ సంఘం ఆధ్వర్యాన ఉపాధ్యాయుల సమస్యలపై నిరంతరం పోరాడుతున్నామని తెలిపారు. సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏ.వీ.నాగేశ్వరరావు, వెంగళరావు, రాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి పి.నాగిరెడ్డితో పాటు విజయ్, పద్మ, ముత్తయ్య, వెంకటేశ్వరరావు, నాగిరెడ్డి, ఉమాదేవి, రాము పాల్గొన్నారు.


