● ఇటీవల గాయపడి తల్లి మృతి ● మెటల్‌తో పాదముద్రలను తయారు చేయించిన కుమారుడు
పాల్వంచ: తల్లి మృతి చెందాక పాదముద్రలను మెటల్ తయారు చేయించి అమ్మపై ప్రేమను చాటుకున్నాడో కుమారుడు. పాల్వంచలో ఈ విశేషం జరిగింది. పట్టణంలోని మార్కెట్ ఏరియాకు చెందిన బాలాజీ ఫొటో స్టూడియో నిర్వాహకుడు అల్లి శరత్ తల్లి లక్ష్మి(55) ఇటీవల కిందపడి గాయపడి కోమాలోకి వెళ్లింది. చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు మెదడులో రక్తం గడ్డకట్టిందని, ఎక్కువ కాలం బతకదని చెప్పారు. దీంతో కుమారుడు నిపుణులను పిలిపించి తల్లి పాదముద్రలను సేకరించి మెటల్‌తో తయారు చేయించాడు. కాళ్లకు మెట్టెలు, తల్లి పట్టీలను అమర్చాడు. కాగా లక్ష్మి మృతి చెందగా ఆదివారం సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లి ఫొటోలు, పాదముద్రలతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయగా, పలువురు ఆసక్తిగా తిలకించారు.