రాష్ట్రస్థాయిలో ద్వితీయ బహుమతి..
కొత్తగూడెంఅర్బన్: రాష్ట్రస్థాయిలో క్షయ విభాగంలో ఉత్తమసేవలు అందించినందుకు జిల్లాకు రాష్ట్రస్థాయిలో ద్వితీయ బహుమతి లభించింది. శనివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మెడికల్ అండ్ హెల్త్ రీజినల్ డైరెక్టర్ డాక్టర్ అనురాధ, రాష్ట్ర క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ రాజేశం చేతులమీదుగా డీఎంహెచ్‌ఓ డాక్టర్ భాస్కర్ నాయక్, జిల్లా క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ బాలాజీనాయక్ అవార్డుతోపాటు ప్రశంసాపత్రం అందుకున్నారు.