● టీఎస్‌ఎన్పీడీసీఎల్
టీజీఎన్పీడీసీఎల్‌గా మార్పు
ఖమ్మంవ్యవసాయం : విద్యుత్ పంపిణీ సంస్థ పేరులో మార్పు చేస్తూ తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర ఉత్తర ప్రాంత విద్యుత్ పంపిణీ (టీఎస్ ఎన్పీడీసీఎల్) సంస్థగా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నామకరణ చేసింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పేరులో స్వల్ప మార్పు చేస్తూ తెలంగాణ ఉత్తర ప్రాంత విద్యుత్ పంపిణీ (టీజీ ఎన్పీడీసీఎల్) సంస్థగా నిర్ణయించింది. దక్షిణ ప్రాంత విద్యుత్ సంస్థకు కూడా టీజీ ఎస్పీడీసీఎల్‌గా నామకరణం చేశారు. సంస్థ నిర్వహణలో ఉన్న కార్యాలయాల బోర్డులను టీజీ ఎన్పీడీసీఎల్ పేరుతో ఏర్పాటు చేసుకోవాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఉమ్మడి జిల్లాలోని ఎస్‌ఈ సర్కిల్ కార్యాలయం మొదలు డీఈ, ఏడీఈ, ఏఏఓస్, ఏఈ ఆపరేషన్స్ కార్యాలయాలు టీజీ ఎన్పీడీసీఎల్ కార్యాలయాలుగా మారనున్నాయి.