
ఆలయంలో డీజీపీ, అధికారులు
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారిని పోలీస్ ఉన్నతాధికారులు సోమవారం దర్శించుకున్నారు. డీజీపీ రవిగుప్తా, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీపీ శివధర్ రెడ్డి, సీఆర్‌పీఎఫ్ డీజీ శబరి, ఐజీ సుమతి, జిల్లా ఎస్పీ రోహిత్‌రాజ్ తదితరులు ఆలయానికి చేరుకోగా, అర్చకులు స్వాగతం పలికారు. ఆలయ ప్రదక్షిణ అనంతరం అంతరాలయంలో మూలమూర్తులను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పండితులు వేదాశీర్వచనం చేసి జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు విజయరాఘవన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.