● మా పాలనలోనే చల్లగా.. | Sakshi
Sakshi News home page

● మా పాలనలోనే చల్లగా..

Published Tue, Apr 23 2024 8:35 AM

ప్రచారంలో బాగంగా సోడా చేస్తున్న వినోద్‌రావు - Sakshi

● పచ్చగా ఉండాలంటే...

బీఆర్‌ఎస్‌ హయాంలో రైతులు పచ్చగా కళకళలాడారని.. ఇప్పుడు సాగునీరు అందక పంటలు కోల్పోతున్నారని బీఆర్‌ఎస్‌ ఖమ్మం అభ్యర్థి నామ నాగేశ్వరరావు విమర్శించారు. ఖమ్మం మార్కెట్‌ను సోమవారం సందర్శించిన ఆయన రైతులు, హమాలీలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. రైతాంగానికి పెద్దపేట వేసిన కేసీఆర్‌కు మద్దతుగా తనను గెలిపించాలని కోరారు. మార్కెట్‌ మాజీ చైర్మన్‌ దోరేపల్లి శ్వేత, నాయకులు పాల్గొన్నారు.

– ఖమ్మం మయూరిసెంటర్‌

బీజేపీ అధికారంలోకి వచ్చాకే దేశమంతా ప్రజలు హాయిగా జీవిస్తున్నార ని ఖమ్మం అభ్యర్థి తాండ్ర వినోద్‌రావు తెలిపారు. ఏన్కూరులో ప్రచారం సందర్భంగా సోమవారం నిర్వహించిన రోడ్డుషోలో ఆయన మాట్లాడారు. మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో ప్రజలందరికీ లబ్ధి జరిగిందని చెప్పారు. మరోమారు బీజేపీని గెలిపిస్తే యువతకు ఉపాధి, సామాన్యులకు విద్య, వైద్యం అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఈమేరకు ఖమ్మం నుంచి తనను గెలిపించాలని కోరారు. – ఏన్కూరు

ఎల్లో మిర్చి తీసుకొచ్చిన రైతుతో మాట్లాడుతున్న నామ
1/1

ఎల్లో మిర్చి తీసుకొచ్చిన రైతుతో మాట్లాడుతున్న నామ

Advertisement
 
Advertisement
 
Advertisement