టిప్పర్‌ దగ్ధం | - | Sakshi
Sakshi News home page

టిప్పర్‌ దగ్ధం

Mar 19 2026 7:50 AM | Updated on Mar 19 2026 7:50 AM

టేకులపల్లి: ప్రమాదవశాత్తు టిప్పర్‌ దగ్ధమైన ఘటన మంగళవారం రాత్రి జరి గింది. బాధితుడి కథనం ప్రకారం.. మండలానికి చెందిన కత్తుల వెంకన్న తన టిప్పర్‌లో కేటీపీఎస్‌ నుంచి యాష్‌ తీసుకెళ్లి నామాలపాడు ఇటుక బట్టీల వద్ద అన్‌లోడ్‌ చేసి తిరిగి అర్ధరాత్రి టేకులపల్లికి బయలుదేరాడు. తొమ్మిదోమైలుతండా దాటాక రాత్రి 2 గంటల సమయంలో ఇంజిన్‌లో పొగలు వస్తుండటంతో టిప్పర్‌ని రోడ్డు పక్కకు నిలిపాడు. క్లీనర్‌ అశోక్‌తోపాటు కిందకు దిగి చూడగా ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. పొగ గమనించి వాహనం దిగడంతో యజ మాని, క్లీనర్‌ ప్రాణాలతో బయటపడ్డారు. కాగా, అటుగా వెళ్తున్న భూక్య మధు అనే వ్యక్తి సమాచారంతో ఇల్లెందు ఫైర్‌ స్టేషన్‌ సిబ్బంది ఫైర్‌ఇంజిన్‌తో వచ్చి మంటలను ఆర్పివేశారు. ఇంజిన్‌ పూర్తిగా దగ్ధమైంది. యాష్‌ రవాణా చేసిన డబ్బులు రూ.20వేలు కూడా కాలిపోయాయని, మొత్తం రూ.14లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితుడు వెంకన్న వాపోయాడు.

వారపు సంత టెండర్‌ వాయిదా

కొత్తగూడెంఅర్బన్‌: కొత్తగూడెం కార్పొరేషన్‌ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన దినసరి మార్కెట్‌, వారపు సంత బహిరంగ టెండర్‌ ప్రక్రియ వాయిదా పడింది. టెండర్‌ బాక్స్‌కు సీల్‌ వేసి లేకపోవడం, సమాచారం ఇవ్వకుండా టెండర్ల ప్రక్రియ నిర్వహించడంతో కాంట్రాక్టర్లు, కార్పొరేటర్లు వాగ్వాదానికి దిగడంతో అధికారులు వాయిదా వేశారు. కబేళాను రూ.1.10 లక్షలకు ఎస్‌కె.ఖదీర్‌పాషా దక్కించుకున్నారు. వారపు సంత, దినసరి మార్కెట్‌కు మళ్లీ టెండర్‌ను నిర్వహిస్తామని కమిషనర్‌ సుజాత ప్రకటించారు. మేయర్‌ గణేష్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement