హామీలను విస్మరించిన ప్రభుత్వం | - | Sakshi
Sakshi News home page

హామీలను విస్మరించిన ప్రభుత్వం

Mar 19 2026 7:50 AM | Updated on Mar 19 2026 7:50 AM

చుంచుపల్లి: కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల హామీలను విస్మరించిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి విమర్శించారు. బుధవారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇంది రమ్మ ఇళ్లు, నిరుద్యోగ భృతి, జాబ్‌ క్యాలెండర్‌ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు, భూ సమస్యలకు పరిష్కారం వంటిహామీలు అమలు చేయడం లేదని ఆరోపించా రు. రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలపై ఈ నెల 20న కలెక్టరేట్‌ ఎదుట నిరసన కార్యక్రమం చేపడతామని తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు భూక్యా రవి, బలగం శ్రీధర్‌, మంగీలాల్‌ తదితరులు పాల్గొన్నారు.

రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

ఖిలా వరంగల్‌: ప్రమాదవశాత్తు రైలు నుంచి జారి పడిన ఓ ప్రయాణికుడు అక్కడికక్కడే మృతిచెందాడు. వరంగల్‌ జిల్లా ఇంటికన్నె – నెక్కొండ స్టేషన్ల మధ్య బుధ వారం ఈ ఘటన జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన జెట్టి పెంటయ్య(48) హైదరాబాద్‌లో కేర్‌ టేకర్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం ఉదయం హైదరాబాద్‌ నుంచి కొత్తగూడేనికి రైలులో బయలుదేరిన ఆయన మార్గమధ్యలో ప్రమాదవశాత్తు జారిపడడంతో మృతిచెందాడు. మృతుడి వద్ద లభించిన ఆధారాలతో బంధువులకు సమాచారం ఇచ్చారు. మృతుడి సోదరుడు మోహన్‌రా వుకు మృతదేహాన్ని అప్పగించినట్లు జీఆర్పీ పోలీసులు తెలిపారు.

ముగ్గురికి జరిమానా

టేకులపల్లి: ముగ్గురు ముద్దాయిలకు రూ.30వేలు జరిమానా విధిస్తూ ప్రిన్సి పల్‌ జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు జడ్జి కీర్తి చంద్రికరెడ్డి బుధవారం తీర్పు వెల్లడించారు. పాతతండాకు చెందిన భూక్య రవీందర్‌, భూక్య అరుణ్‌, భూక్య బాబులు తనపై దాడిచేశారని అదే తండాకు చెందిన ఇస్లావత్‌ నారాయణ 2021లో టేకులపల్లి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదైంది. కోర్టులో విచారణ జరగగా, న్యాయమూర్తి పైవిధంగా తీర్పు ఇచ్చారు.

వృత్తి విద్యా కోర్సులపై దృష్టి సారించాలి

పాల్వంచ: వృత్తి విద్యా కోర్సులపై యువత దృష్టి సారించాలని జిల్లా ఎంప్లాయిమెంట్‌ ఆఫీసర్‌ కె.శ్రీరామ్‌ అన్నారు. బుధవారం నవ ఒకేషనల్‌ ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌లో వెల్డర్‌, ఫిట్టర్‌, ఎలక్ట్రికల్‌, సోలార్‌ కోర్సుల్లో శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు సర్టిఫికెట్లను అందించి మాట్లాడారు.

‘ఉపాధి’ నిర్మాణాలు పూర్తి చేయాలి

చండ్రుగొండ: ఉపాధి పథకం నిధులతో చేపట్టిన నిర్మాణాల పనులు పూర్తి చేయాలని డీఆర్‌డీఓ విద్యాచందన సూచించారు. బుధవారం ఆమె మండలంలోని చండ్రుగొండ, రావికంపాడు, గుర్రాయిగూడెం గ్రామాల్లో పాఠశాల ప్రహరీ, వీఓ బిల్డింగ్‌, సీసీరోడ్డు, బస్టాండ్‌ ప్రాంగణంలో చేపట్టిన పనులను, డ్రాగన్‌ ఫ్రూట్‌ తోటను పరిశీలించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ బయ్యారపు అశోక్‌, ఎంపీఓ ఖాన్‌, ఉపాధి ఏపీఓ శ్రీను పాల్గొన్నారు.

కేవీకేలో రైతు సదస్సు

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల నాలుగో సంవత్సరం విద్యార్థులు బుధవారం కృషి విజ్ఞాన కేంద్రంలో రైతు సదస్సు కిసాన్‌ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విద్యాలయ విస్తరణ సంచాలకుడు డాక్టర్‌ యాకాద్రి, వ్యవసాయ కళాశాల అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ హేమంత్‌ కుమార్‌ మాట్లాడుతూ రైతులు భూ సార పరీక్ష చేయించుకుని అనుగుణంగా ఎరువులు వాడాలని సూచించారు. త్రీ ఇంక్‌లైన్‌ సర్పంచ్‌ ప్రవళ్లిక, కేవీకే శాస్త్రవేత్తలు డాక్టర్‌ భరత్‌, శరత్‌చంద్ర, శివ, సొసైటీ చైర్మన్‌ మండే వీర హనుమంతరావు, సీనియర్‌ ప్రొఫెసర్‌ నాగాంజలి పాల్గొన్నారు.

‘కొబ్బరి’ ఆఫీస్‌ ఏర్పాటు చేయాలి

ఖమ్మంమయూరిసెంటర్‌: తెలంగాణ లోనే అత్యధికంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొబ్బరి తోటలు ఉన్నందున కొబ్బరి అభివృద్ధి బోర్డు ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయాలని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి కోరారు. పార్లమెంట్‌లో బుధవారం ఆయన రైతుల ఆదాయం స్థిరీకరణ, మార్కెట్‌ భరోసా, మౌలిక వసతు ల అభివృద్ధి తదితర అంశాలతో పాటు బొగ్గు ఉత్పత్తి, సరఫరా వ్యవస్థపై కేంద్రాన్ని ప్రశ్నించారు. కొబ్బరి తోటల విస్తీర్ణం దృష్ట్యా అశ్వారావుపేట లేదా దమ్మపేటలో కొబ్బరి అభివృద్ధి బోర్డు ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తిచేశారు. తద్వారా రైతులకు సాంకేతిక సాయం, నాణ్య మైన సాగు, మార్కెట్‌ అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. అంతేకాక మొక్కజొన్నలకు కనీస మద్దతు ధర దక్కక రైతులు నష్టపోతున్నందున దృష్టి సారించాలని కోరారు.

చర్యలు తీసుకోవాలి

పాల్వంచ: ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బు తీసుకుని మోసం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు తలారి జ్యోతి కోరింది. బుధవారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. శ్రీనివాసరావు అనే వ్యక్తి ఉద్యోగం ఇప్పిస్తానని రూ.35 లక్షలు తీసుకున్నాడని ఆరోపించింది. డబ్బులు ఇస్తానంటే విజయవాడ వెళ్లగా, అక్కడి నుంచి కారులో ఎక్కించుకుని హైదరాబాద్‌ తీసుకెళ్లి బంధించాడని పేర్కొంది. తన వద్ద ఉన్న ఆధారాలు లాక్కుని తిరిగి 20 రోజుల తర్వా త పాల్వంచకు పంపించాడని తెలిపింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని ఆరోపించింది. ఈ విషయమై ఎస్‌ఐ నాగరాజును వివరణ కోరగా.. తమకు ఎలాంటి ఫిర్యాదు రా లేదని తెలిపారు. గతంలో ఆమెనే మిస్సింగ్‌ కావడంతో కేసు నమోదు చేశామని, బూర్గంపాడులో తండ్రే ఆమైపె కేసు పెట్టినట్లు సమాచారం ఉందని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement