సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా | - | Sakshi
Sakshi News home page

సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా

Nov 28 2026 1:32 AM | Updated on Nov 28 2026 1:32 AM

ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్‌

బాపట్ల: రెండో దశ పంచాయతీ ఎన్నికలు జరగనున్న చీరాల, వేమూరు నియోజకవర్గాల పరిధిలోని పంచాయతీల్లో శుక్రవారం సాయంత్రం ప్రచారానికి తెరపడిందని, సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టామని జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్‌ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయని హెచ్చరించారు. ఈ నెల 29వ తేదీన రెండో దశ పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ... బాపట్ల జిల్లాలోని చీరాల, వేటపాలెం, చుండూరు, అమృతలూరు, వేమూరు, కొల్లూరు, భట్టిప్రోలు మండలాల్లో పోలింగ్‌ ఈ నెల 29వ తేదీన జరగనుందని తెలిపారు. మొత్తం 7 మండలాల పరిధిలో 113 పంచాయతీలు, 1,204 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉందన్నారు. వీటిలో 17 సర్పంచ్‌ స్థానాలు, 393 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమయ్యాయని తెలిపారు. మిగిలిన 96 పంచాయతీలు, 811 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సర్పంచ్‌ స్థానాలకు 281 మంది, వార్డు సభ్యుల స్థానాలకు 1,964 మంది పోటీలో ఉన్నారని తెలిపారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు ఇప్పటివరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఉంటే, వారు తక్షణమే ఆయా ప్రాంతాల నుంచి వెళ్లిపోవాలని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు మద్యం దుకాణాలు తెరవడానికి అనుమతి లేదని పేర్కొన్నారు. అత్యంత సమస్యాత్మక, సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దష్టి సారించామని చెప్పారు. ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. సమస్యలు ఉంటే జిల్లా పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌ 83338 13228 లేదా 112కు సమాచారం అందించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement