తల్లిదండ్రులు కష్టపడటం చూసి లక్ష్యాన్ని సాధించాలని నిర్ణయించుకున్నా. అమెజాన్‌లో అవకాశంతో అది నిజమైంది. డేటా ఇంజినీర్ ఇంటర్న్‌గా ఎంపికయ్యాను. ఏటా రూ. 46 లక్షల వేతనం. నాన్న రాంబాబు ప్రైవేట్ హాస్టల్‌లో చిరుద్యోగి. అమ్మ సుజాత టైలర్‌గా పనిచేస్తూ మమ్మల్ని చదివించారు. వారి కష్టం, త్యాగాలే నాకు నిరంతరం స్ఫూర్తినిచ్చాయి. మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు ప్రత్యేకంగా ప్రేరణ అవసరం లేదు. మనం పెరిగిన పరిస్థితులు, తల్లిదండ్రుల కష్టమే ముందుకు నడిపిస్తాయి.
– చెన్నుపల్లి వరలక్ష్మీ ప్రసన్న,
సీఎస్‌ఈ, సంగడిగుంట, గుంటూరు.


