ఆంజనేయస్వామి విగ్రహానికి నిప్పు | Anjaneya Swamy statue set on fire | Sakshi
Sakshi News home page

ఆంజనేయస్వామి విగ్రహానికి నిప్పు

Nov 28 2026 5:34 AM | Updated on Nov 28 2026 5:34 AM

Anjaneya Swamy statue set on fire

బాపట్ల జిల్లా పేరాల శివాలయం వద్ద ఘటన

ఆంజనేయస్వామి విగ్రహానికి నిప్పుపెట్టిన దుండగుడు 

చీరాల/గాందీనగర్‌ (విజయవాడ సెంట్రల్‌): బాపట్ల జిల్లా చీరాలలోని పేరాల శివాలయం ఎదురుగా ఉన్న అభయాంజనేయస్వామి విగ్రహానికి శుక్రవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తి నిప్పంటించాడు. స్వామివారి విగ్రహంపై ఉన్న వ్రస్తాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. మందిరం వద్ద ఉన్న సీసీ కెమెరాలు కూడా పగలకొట్టి ఉన్నట్లు దేవస్థాన కమిటీ సభ్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుని ధర్నా చేశారు. 

కాగా, ఈ ఘటనపై మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు స్పందిస్తూ.. చంద్రబాబు కూటమి పాలనలో హిందూ ఆలయాలకు, స్వామివారి విగ్రహాలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. ఇలాంటి వరుస ఘటనలు బాబు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. ఆలయాల పరిరక్షణ చూడాల్సిన దేవదాయ శాఖ పూర్తిగా నిద్రమత్తులో జోగుతోందని విమర్శించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement