రాజేంద్రన్‌ ముమ్మాటికి వైఎస్సార్‌సీపీ కార్యకర్తే | Rajendran is a YSRCP activist | Sakshi
Sakshi News home page

రాజేంద్రన్‌ ముమ్మాటికి వైఎస్సార్‌సీపీ కార్యకర్తే

Nov 28 2026 5:11 AM | Updated on Nov 28 2026 5:11 AM

Rajendran is a YSRCP activist

వైఎస్సార్‌సీపీ కండువాతో రాజేంద్రన్‌ (ఫైల్‌) , వైఎస్సార్‌సీపీ సభ్యత్వం కార్డు

పచ్చ మూకల దాడి.. కారు ఢీకొని ఈడ్చుకెళ్లడంతో మృతి 

తప్పును కప్పిపుచ్చేందుకు టీడీపీ కార్యకర్త అంటూ తప్పుడు ప్రచారం 

ఎమ్మెల్సీ భరత్, మండల కన్వీనర్‌ మురుగేష్‌ స్పష్టీకరణ 

సెప్టెంబర్‌ 5న పార్టీ గుర్తింపు కార్డు కూడా పంపిణీ

సాక్షి టాస్క్ ఫోర్స్ : చావులను కూడా రాజకీయంగా వాడుకోవడంలో తమకెవరూ సాటి రారని వెన్నుపోటు పార్టీ నేతలు నిరూపించారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలం జంపనూరు గ్రామానికి చెందిన రాజేంద్రన్‌ను గురువారం వానగుట్టపల్లిలో ఎన్నికల ఆర్వో కారు ఢీకొని.. ఈడ్చుకెళ్లడంతో మృతి చెందిన విషయం విదితమే. వానగుట్టపల్లి సర్పంచ్‌గా అనిత గెలుపొందినట్లు తెలియగానే టీడీపీ శ్రేణులు.. లైట్లు ఆపేసి, ఎన్నికల సిబ్బంది, వారి వాహనాలపై దాడిచేసి ఫలితాలు తారుమారు చేసేందుకు యత్నించడమూ తెలిసిందే. 

ఆ సమయంలో టీడీపీ మూకలు ఆర్వో వాహనాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించగా, డ్రైవర్‌ ఆ వాహనాన్ని వేగంగా తీసుకెళ్తుండగా, రోడ్డు పక్కనే ఉన్న వైఎస్సార్‌సీపీ కార్యకర్త రాజేంద్రన్‌ను ఢీకొని.. కిలోమీటర్‌ దూరం ఈడ్చుకుంటూ వె­ళ్లింది. అప్పటికే రాజేంద్రన్‌ విగత జీవిగా మారారు. ‘ఇతను ముమ్మాటికి వైఎస్సార్‌సీపీ కార్యకర్తే. 2026 ఏ­ప్రి­ల్‌ 10న వైఎస్సార్‌సీపీ సభ్యత్వం తీసుకున్నాడు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. సెపె్టంబ­రు 5న పార్టీ గుర్తింపు కార్డు కూడా పంపిణీ చేశాం. 

టీ­డీపీ నాయకత్వం వానగుట్టపల్లిలో జరిగిన తప్పుల­ను కప్పిపుచ్చుకునేందుకు రాజేంద్రన్‌ టీడీపీకి చెందిన వ్యక్తిగా ప్రచారం చేసుకుంటోంది. ఇందులో ఏమాత్రం వాస్తవం లేదు. ఇది కేవలం టీడీపీ శ్రేణుల దాడుల వల్ల జరిగిన పరిణామమే. దీనికి పూర్తి బాధ్యత టీడీపీ నాయకత్వమే వహించాలి’ అని ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ కుప్పం నియోజకవర్గ సమన్వయకర్త భరత్, మండల కన్వీనర్‌ హెచ్‌ ఎం మురుగేష్‌ స్పష్టం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement