రేయ్‌ లం.. కొడకా... చెప్పుతో కొడతా.. నరుకుతా.. | TDP MLA Amilineni lashes out at election official with abusive language | Sakshi
Sakshi News home page

రేయ్‌ లం.. కొడకా... చెప్పుతో కొడతా.. నరుకుతా..

Nov 28 2026 5:06 AM | Updated on Nov 28 2026 5:06 AM

TDP MLA Amilineni lashes out at election official with abusive language

ఇంటి అడ్రస్‌ పెట్టు.. వచ్చి నీ సంగతి తేలుస్తా  

మీ ఉద్యోగులంతా దొంగ నా కొడుకులు..  

ఎన్నికల అధికారిపై బూతులతో విరుచుకుపడిన టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని  

ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ,ఉద్యోగ సంఘాల డిమాండ్‌  

సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘రేయ్‌ లం.. కొడకా.. చెప్పుతో కొడతా.. ఏం అనుకుంటున్నావ్‌ నువ్వు.. నీ అంతు తేలుస్తా.. నీ ఇంటికి వచ్చి అడ్డంగా నరికేస్తా..’ అంటూ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు రెచ్చిపోయారు. ప్రజాప్రతినిధిగా గౌరవనీయ స్థానంలో ఉన్న ఆయన ఎన్నికల అధికారిని పేపర్లో రాయలేని భాషలో దూషించారు. వివరాల్లోకి వెళితే.. కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరు మండలం తిమ్మాపురం పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారు గౌని రేణుక విజయం సాధించారు. కూటమి మద్దతిచ్చిన రోజాపై 29 ఓట్లతో రేణుక గెలిచారు. 

రేణుక గెలుపును సహించలేని టీడీపీ నాయకులు నాలుగుసార్లు రీ కౌంటింగ్‌ చేయించారు. అయినా రేణుకకే మెజార్టీ రావడంతో రిటర్నింగ్‌ అధికారిగా విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు కాంతరాజు ఆమె విజయం సాధించినట్లు ప్రకటించి, డిక్లరేషన్‌ ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అమిలినేని శుక్రవారం కాంతరాజుకు ఫోన్‌ చేసి బూతులు తిట్టారు. ‘రేయ్‌ ఎర్రి పూ... నా కొడకా.. చెప్పుతో కొడతా.. లం.. కొడకా.. నా కొడకా నిన్ను ఎత్తుకెళ్లి నరుకుతా.. ఏమనుకుంటున్నావ్‌ రా.. లోఫర్‌.. పోలింగ్‌ బూత్‌లో ఏం జరిగిందో మర్యాదగా వచ్చి రాసివ్వు.. మీరంతా నిజాయితీ లేని నా కొడుకులు.. మళ్లీ మాట్లాడతావ్‌.. మెట్టుతో కొడతా నా కొడకా.. ఫస్ట్‌ నువ్‌ ఎక్కడుంటావో చెప్పు రా.. నీ ఇంటి అడ్రస్‌ పంపించు.. నీ ఇంటికే వస్తా.. నీ భార్యా పిల్లల ముందే నీ కథ తేలుస్తా.. మీ ఉద్యోగులంతా దొంగ నా కొడుకులు రా.. మీకు విశ్వాసమే ఉండదు..’  అంటూ తీవ్ర పదజాలంతో దూషించారు.  

పరిటాల సునీతపైనా అనుచిత వ్యాఖ్యలు  
ఎమ్మెల్యే తిడుతున్నా కాంతరాజు సంయమనం కోల్పోలేదు. కౌంటింగ్‌ కేంద్రంలో జరిగిన విషయాన్ని ఆయన చెబుతున్నా ఎమ్మెల్యే వినిపించుకోలేదు. ‘మీ అల్లుడికి నేను బాగా తెలుసు సార్‌.. నేను అలా (ప్రత్యర్థి పార్టీకి అనుకూలంగా) వ్యవహరించను. కావాలంటే పరిటాల సునీతక్కను కూడా అడగండి సార్‌’ అంటూ వివరణ ఇచ్చారు. దీంతో అమిలినేని మరింత రెచ్చిపోయారు. ‘సునీత అక్క లేదు.. ..లేదు.. నీది ఏమైనా ఉంటే ఆమె వద్ద చేసుకో నా వద్ద కాదు’ అంటూ సొంత పార్టీకే చెందిన మహిళా ప్రజాప్రతినిధిపైనా నీచంగా మాట్లాడారు. ఎమ్మెల్యే బెదిరింపుల ఆడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

‘ప్రభుత్వ ఉద్యోగులంతా దొంగ నా కొడుకులు.. మీకు ఏ మాత్రం విశ్వాసం ఉండదురా’ అంటూ తిట్టడంపై ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఒక ప్రజాప్రతినిధిగా సొంత పార్టీకి చెందిన మహిళా ప్రజాప్రతినిధితో పాటు ఉద్యోగులను నీచంగా తిట్టడం చర్చనీయాంశంగా మారింది. బూతు పురాణంతో రెచ్చిపోయిన అమిలినేనిపై కఠినచర్యలు తీసుకోవాలని, లేకపోతే కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని ఉపాధ్యాయ, ఉద్యోగసంఘాలు హెచ్చరిస్తున్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement