కుట్రలు ఛేదిస్తూ.. విజయాన్ని అందుకుంటూ.. | - | Sakshi
Sakshi News home page

కుట్రలు ఛేదిస్తూ.. విజయాన్ని అందుకుంటూ..

Nov 28 2026 12:32 AM | Updated on Nov 28 2026 12:32 AM

నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు 20 పంచాయతీలు కై వశం టీడీపీ శ్రేణుల అరాచకాలు తట్టుకొని నిలబడ్డ వైఎస్సార్‌సీపీ ఓటమిని జీర్ణియించుకోలేక టీడీపీ మూకల అరాచకాలు వైఎస్సార్‌సీపీ కార్యకర్తను దారుణంగా హత్య చేసిన వైనం భయంతో వణికిపోతున్న స్థానిక ప్రజలు

గుడుపల్లె మండలం చీకటిపల్లిలో వైఎస్సార్‌సీపీ శ్రేణుల సంబరాలు

రామకుప్పంలో ర్యాలీ నిర్వహిస్తున్న వైఎస్సార్‌ సీపీ నాయకులు

ఇందుగలడందులేడని.. సందేహము వలదు.. అన్నట్టు వైఎస్సార్‌సీపీ కరుడుగట్టిన

అభిమానులు సీఎం సొంత నియోజకవర్గం కుప్పంలోనూ కోకొల్లలే ఉన్నారు. స్థానిక ఎన్నికల్లో టీడీపీ మూకల అరాచకాలకు

ఎదురొడ్డి నిలబడ్డారు. ప్రాణాలకు తెగించి నామినేషన్లదాకా వెళ్లారు. కానీ జెడ్పీటీసీ,

ఎంపీటీసీ ఎన్నికల్లో అధికార మదంతో

బరితెగించి అనేక సెగ్మెంట్లను ఏకగ్రీవాలు ప్రకటించుకున్నారు. కానీ పంచాయతీ ఎన్నికల్లో వారి పప్పులు ఉడకలేదు.

అక్రమ అరెస్ట్‌లు, రిగ్గింగ్‌లు, దాడులు, దౌర్జన్యాలకు వెరవలేదు. వైఎస్సార్‌సీపీ మద్దతు సర్పంచ్‌, వార్డు సభ్యులు

గుండైధెర్యంతో నిలబడ్డారు. ప్రజల మద్దతుతో వైఎస్సార్‌సీపీ విజయ

పతాకాన్ని ఎగురవేశారు. ‘మీకు సాటిలేదు.. మీ విజయాన్ని ఆపలేరు జగనన్నా’

అంటూ కుప్పం నియోజకవర్గం మొత్తం

వెలుగెత్తి చాటారు.

సాక్షి ప్రతినిధి, తిరుపతి: కుప్పం గడ్డపై వైఎస్సార్‌ సీపీ జెండా రెపరెపలాడింది. సీఎం చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ సత్తాచాటింది. నామినేషన్ల దశ నుంచి కౌంటింగ్‌ వరకు అనేక అడ్డంకులు ఎదురైనా.. నామినేషన్లు వేయనివ్వకుండా.. పరిశీలన పేరుతో నామినేషన్లు తిరస్కరించినా.. పోలింగ్‌ కేంద్రాల్లో ఏజెంట్లను అనుమతించకపోయినా.. వెరవలేదు. నియోజకవర్గంలోని పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు ఘన విజయం సాధించారు. టీడీపీ అక్రమమార్గంలో గెలుపొందినట్లు ప్రకటించుకున్నా.. ఆ పంచాయతీల్లో ఎక్కువ వార్డుల్లో వైఎస్సార్‌సీపీ సానుభూతి పరులే విజయదుందుభి మోగించారు. కుప్పం నియోజకవర్గ పరిధిలో మొత్తం 92 పంచాయతీలు ఉన్నాయి. నోటిఫికేషన్‌ వెలువడ్డాక నామినేషన్‌ ప్రక్రియ నుంచి ఉపసంహరణ వరకు టీడీపీ శ్రేణులు కుట్రలు, దౌర్జన్యాలు చేసి మూడు పంచాయతీలను ఏకగ్రీవం చేసుకోగలిగారు. మిగిలిన 89 పంచాయతీల్లో గురువారం ఎన్నికలు జరిగేలా వైఎస్సార్‌సీపీ శ్రేణులు పోరాడి నిలబడ్డారు. అందులో 20 పంచాయతీల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు సర్పంచ్‌లు విజయ ఢంకా మోగించారు.

అడ్డదారిలో మున్సిపాలిటీ, జెడ్పీటీసీ, ఎంపీపీలు కై వశం

నియోజకవర్గ పరిధిలోని కుప్పం మున్సిపాలిటీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ అక్రమ మార్గంలో కై వశం చేసుకుంది. కుప్పం మున్సిపాలిటీలో 32 వార్డులు ఉన్నాయి. 13 మంది వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ప్రపోజర్స్‌ సంతకాలను ఫోర్జరీ చేసి వాటిని టీడీపీ కై వశం చేసుకుంది. చైర్మన్‌ అభ్యర్థి విజయకుమార్‌ని కిడ్నాప్‌చేసి భయపెట్టారు. నామినేషన్‌ తరువాత జరిగే పరిశీలన కార్యక్రమానికి వెళ్లిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల సర్టిఫికెట్లను లాక్కుని చించివేశారు. కౌంటింగ్‌ కేంద్రాల్లో ఉన్న వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను కొట్టి బయటకు లాగిపడేశారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లోనూ అరాచకం సృష్టించారు. రామకుప్పం మండలంలోని 15 ఎంపీటీసీ స్థానాలకు అక్రమ మార్గంలో ఏకగ్రీవం చేసుకున్నారు. శాంతిపురం మండల పరిధిలోని నాలుగు ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్‌ జరుగుతుండగా.. ఏజెంట్లను బయటకు తరిమేసి ఏకపక్షం చేసుకున్నారు. కుప్పం మండలం కొటాలూరు ఏజెంట్‌ని బయటకు ఈడ్చిపడేసి గెలుపొందినట్లు ప్రకటించుకున్నారు. ఇలా కుప్పం నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు అనేక అరాచకాలు సృష్టించినా.. వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఎదురొడ్డి పోరాడారు. వారి పోరాటాల ఫలితమే నియోజక వర్గంలో 20 సర్పంచ్‌ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ సానుభూతి కై వశం చేసుకుని రాష్ట్రంలో సంచనం సృష్టించారు.

వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు గెలుపొందిన పంచాయతీలు

కొత్తపల్లె, గణేష్‌పురం,

మోట్లచేను, వనగుట్టపల్లె

చీకటిపల్లె, పొగరుపల్లె

ఓఎన్‌ కొత్తూరు, గుండ్లసాగరం

రామకుప్పం, నారాయణపురం తండా

బల్ల, కెంచనబల్ల

(వైసీపీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థి విజయం)

కెనుమాకులపల్లె, ఎంకే పురం, అనికెర

సొన్నేగానిపల్లె, దండికుప్పం, చెంగుబల్ల

కోలమడుగు, రాళ్లబుదుగూరు

శాంతిపురం మండలం, కర్లగట్ట సర్పంచ్‌ ఎన్నికల్లో ఓటమి భయంతో టీడీపీ శ్రేణులు విద్యుత్‌ సరఫరా కట్‌చేసి ఓట్లను తారుమారు చేసేందుకు ప్రయత్నించారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు నిరసన తెలియజేయడంతో టీడీపీ శ్రేణులు పోలీసులపై ఒత్తిడితెచ్చి లాఠీలతో కొట్టించారు. కోనేరుకుప్పం వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడుకి పోలింగ్‌లో ఆధిక్యత వస్తే.. టీడీపీ శ్రేణులు అధికారులపై ఒత్తిడి తెచ్చారు. ఆపై టీడీపీ సానుభూతిపరుడు గెలుపొందినట్లు ప్రకటించుకున్నారు. అయితే కోనుకుప్పంలో ఏడు వార్డుల్లో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులే విజయం సాధించడం విశేషం. సొన్నేగానిపల్లి పంచాయతీలో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడు శ్రీనివాసులు విజయం సాధించినా.. డిక్లరేషన్‌ ఇవ్వకుండా అడ్డుకున్నారు. వైఎస్సార్‌సీపీ జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేయడంతో చేసేది లేక శ్రీనివాసులు సర్పంచ్‌గా విజయం సాధించినట్లు డిక్లరేషన్‌ ఇచ్చారు. ఇంకా శెంగుబల్ల, కెనుమాకులపల్లి, కడపల్లిలో నామినేషన్లు వేయనివ్వకుండా అడ్డుకున్నారు. అయినా స్థానిక వైఎస్సార్‌సీపీ శ్రేణులు నామినేషన్లు వేసి పోటీకి దిగారు. చివరకు వైఎస్సార్‌సీపీ నేతలు ప్రచారం చేయనివ్వకుండా అడ్డుకుని మండల పార్టీ అధ్యక్షుడు దండపాణిని అరెస్టు చేసి నిర్బంధించారు. ఇలా చేయడానికి కడపల్లి పంచాయతీ పరిధిలో సీఎం చంద్రబాబు నివాసం ఉండడమే ఇందుకు కారణమని స్థానికులు చెబుతున్నారు. అలాగే శెంగుబల్ల, కెనుమాకులపల్లిలోనూ వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు విజయం సాధించారు. శాంతిపురం మండల పార్టీ అధ్యక్షుడు దండపాణిని గురువారం పోలీసులు అరెస్టు చేశారు. గుంజార్లపల్లి పంచాయతీ సర్పంచ్‌ అభ్యర్థి భర్త మల్లికార్జునరెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ్రామస్తులు నిరసన తెలియజేడంతో మల్లికార్జునరెడ్డిని విడిచిపెట్టారు.

కుప్పం మండలం నాయినూరు, బ్రహ్మదేవరచేన్లు, దేవరాజపురంలో వైఎస్సార్‌సీపీ సానుభూతి పరులను నామినేషన్లు వేయనివ్వకుండా అడ్డుకుని దాడులకు తెగబడ్డారు. మోట్లచేను పంచాయతీలో సర్పంచ్‌ అభ్యర్థితో పాటు 9 వార్డుల్లోనూ వైఎస్సార్‌సీపీ సానుభూతి పరులే విజయం సాధించారు.

వానగుట్టపల్లి పంచాయతీలో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరురాలు అనిత 48 ఓట్లతో గెలుపొందారు. ఓటమిని జీర్ణియించుకోలేని టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడ్డారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్త రాజేంద్రని వాహనంతో గుద్ది దారుణంగా హత్య చేశారు.

గుడుపల్లి మండలం ఓయన్‌కొత్తూరులో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరురాలు ధైర్యంగా కృష్ణవేణి నామినేషన్‌ వేశారు. ఈమె గెలుపు కోసం ప్రచారం చేసేందుకు వెళ్లిన ఎమ్మెల్సీ భరత్‌ని టీడీపీ మూకలు అడ్డుకున్నారు. అయినా కృష్ణవేణి విజయం సాధించారు. ఓటమిని జీర్ణియించుకోలేని టీడీపీ శ్రేణులు నాలుగు పర్యాయాలు రీ కౌంటింగ్‌ నిర్వహించారు. రీకౌంటింగ్‌లోనూ వైఎస్సార్‌సీపీ సానుభూతిపరురాలు ఆధిక్యత చాటుకున్నారు.

రామకుప్పం మండలంలో నాలుగు పంచాయతీల్లో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు విజయం సాధించారు.

కుప్పం

మండలం

గుడుపల్లె

మండలం

రామకుప్పం

మండలం

శాంతిపురం మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement