జెడ్పీ చైర్‌పర్సన్‌ బాధ్యతల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

జెడ్పీ చైర్‌పర్సన్‌ బాధ్యతల స్వీకరణ

Nov 28 2026 12:32 AM | Updated on Nov 28 2026 12:32 AM

చిత్తూరు కార్పొరేషన్‌: జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌గా శైలజ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జెడ్పీ సీఈఓ రవికుమార్‌ నాయుడు, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్‌, ఉద్యోగులు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జెడ్పీ చైర్‌పర్సన్‌ విలేకర్లతో మాట్లాడుతూ అధికారుల సహకారంతో జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తామని తెలిపారు. ప్రధానంగా తాగునీటి ఎద్దడి పరిష్కారంపై దృష్టి సారిస్తామని వెల్లడించారు. విద్య, వైద్యం, మహిళా, శిశు సంక్షేమంతో పాటు రవాణా, కమ్యూనికేషన్‌ వ్యవస్థలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తామని వివరించారు.

వరల్డ్‌ మేయర్స్‌ ఫోరమ్‌కు అనిల్‌కుమార్‌

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లోకల్‌ సెల్ఫ్‌ గవర్నమెంట్‌ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ముంబైలో నిర్వహించిన 3వ వరల్డ్‌ మేయర్స్‌ ఫోరమ్‌కు చిత్తూరు నగరపాలక సంస్థ ఆరోగ్య అధికారి డాక్టర్‌ అనిల్‌ కుమార్‌ హాజరయ్యారు. ముంబైలోని హోటల్‌ ఫెయిర్‌ మౌంట్‌ లో మూడు రోజుల పాటు జరిగిన ఈ అంతర్జాతీయ స్థాయి సదస్సులో వివిధ దేశాలకు చెందిన నగరాల మేయర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, పట్టణాభివద్ధి రంగ నిపుణులు, విద్యావేత్తలు పాల్గొన్నారు. స్థానిక సంస్థల పరిపాలన బలోపేతం చేయడం, భవిష్యత్‌ నగరాల రూపకల్పన, ఆధునిక పాలన విధానాలు తదితర అంశాలపై సదస్సులో చర్చించారు.

రేపే రెండో విడత పోలింగ్‌

చిత్తూరు కార్పొరేషన్‌ : పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఆదివారం రెండో విడత పోలింగ్‌ నిర్వహించనున్నారు. పూతలపట్టు, నగరి, రొంపిచెర్ల, పులిచెర్లల్లోని మొత్తం 10 మండలాల్లో ఎన్నికలు చేపట్టనున్నారు. ఈమేరకు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. రెండో విడతలో 253 పంచాయతీలు 2,282 వార్డు స్థానాలకు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఈ క్రమంలోనే 80 సర్పంచ్‌ స్థానాలు, 1,526 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమ య్యాయి. మిగిలిన 173 సర్పంచ్‌ స్థానాలకు 483 మంది, 748 వార్డు సభ్యుల స్థానాలకు 1,594 మంది బరిలో ఉన్నారు. ఈ మేరకు మొత్తం 1,076 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేశా రు. పది మండలాల్లో మొత్తం 2,32,910 మంది ఓటర్లు ఉన్నారు. సెన్సిటివ్‌, హైపర్‌ సెన్సి టివ్‌ పోలింగ్‌ కేంద్రాలు 192, సాధారణ పోలింగ్‌ కేంద్రాలు 884 ఉన్నాయి. మొత్తం 33 జోన్లు, 52 రూట్స్‌, క్లస్టర్స్‌ 57 ఏర్పాటు చేయగా పీఓలు 1,181, ఏపీఓలు 1,798 మందిని నియమించారు.

సౌత్‌జోన్‌ చెస్‌ పోటీలకు కుప్పం విద్యార్థి

కుప్పంరూరల్‌: ఇంటర్‌ వర్సిటీ సౌత్‌జోన్‌ చెస్‌ పోటీలకు కుప్పం డిగ్రీ కళాశాల విద్యార్థి జగదీష్‌ ఎంపికై నట్లు చైర్‌పర్సన్‌ శాంతానాగరాజు శుక్రవారం తెలిపారు. తిరుపతిలో నిర్వహించిన అంతర్‌కళాశాలల చెస్‌ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి యూనివర్సిటీ తరఫున సౌత్‌జోన్‌ పోటీలకు ఎంపికై నట్లు చెప్పారు. డిసెంబరు 2 నుంచి 4వ తేదీ వరకు సూరంపాళెం ఆదిత్య యూనివర్సిటీలో చేపట్టనున్న సౌత్‌జోన్‌ ఇంటర్‌ వర్సిటీ పోటీల్లో జగదీష్‌ పాల్గొంటారని వెల్లడించారు. ఈ సందర్భంగా జగదీష్‌ను వైస్‌ చైర్మన్‌ సాగర్‌రాజ్‌, ప్రిన్సిపల్‌ సుధారాణి అభినందించారు.

ఏకగ్రీవం..

సర్పంచ్‌ పదవీ పంపకం

వెదురుకుప్పం : మండలంలోని యనమలమంద పంచాయతీ సర్పంచ్‌ పదవిని ఇరువురు పంచుకున్నారు. ఎస్టీలకు కేటాయించిన సర్పంచ్‌ స్థానానికి వైఎస్సార్‌సీపీ, టీడీపీ బలపరిచిన ఇద్దరు అభ్యర్థులు బరిలో దిగారు. అయితే ఎన్నికల జరిగితే గ్రామాల్లో లేనిపోని సమస్యలు ఉత్పన్నమవుతాయన్న ఉద్దేశంతో స్థానిక నేతలు, ప్రజలు ఓ నిర్ణయానికి వచ్చారు. ఎన్ని కలు లేకుండా పంచాయతీని ఏకగ్రీవం చేసుకునేందుకు అందరూ సహకరించాలని అభ్యర్థులను ఒప్పించారు. ఐదేళ్ల సర్పంచ్‌ పదవీ కాలంలో వైఎస్సార్‌సీపీ, టీడీపీ అభ్యర్థులకు రెండున్నరేళ్ల లెక్కని పంపకం చేశారు. ఈ క్రమంలో ముందుగా టీడీపీ మద్దతుదారుడైన హరీష్‌ను సర్పంచ్‌గా ఏకగ్రీవం చేశారు. తర్వాత రెండున్నరేళ్లు వైఎస్సార్‌సీపీ మద్దతుదారుడికి ఇవ్వా లని రాతపూర్వకంగా హామీ తీసుకున్నారు. పంచాయతీలో 8 వార్డులకు గాను 5 వార్డుల్లో వైఎస్సార్‌సీసీ మద్దతుదారులు, 3 వార్డుల్లో టీడీపీ బలపరిచినవారు ఏకగ్రీవమైనట్లు గ్రామస్తులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement