పంచాయతీ ఎన్నికల్లో కూటమికి షాక్ అధికార బలం, అడ్డదారులను దాటిన తీర్పు కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల జయకేతనం
కుట్రలను ఛేదించిన
చిత్తూరు కార్పొరేషన్ : అధికార బలంతో ఎన్ని కుట్రలు పన్నినా, అడ్డంకులు సృష్టించినా అంతిమంగా ఓటరు తీర్పును మాత్రం కూటమి నేత లు మార్చలేకపోయారు. ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కి, బెదిరింపులు, అక్రమాలకు పాల్పడినప్పటికీ పల్లె ప్రజలు మాత్రం జంకలేదు. వైఎస్సార్‌సీపీ మద్దతుదారులకే స్పష్టమైన తీర్పునిచ్చి కూటమికి గట్టి షాక్ ఇచ్చారు. జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు అధికార పక్షానికి బెంబేలెత్తించేలా వచ్చాయి. గ్రామీణ ఓటర్లు వైఎస్సార్‌సీపీ మద్ధతుదారుల వైపు నిలబడడం చర్చనీయాంశంగా మారింది.
83.37 శాతం పోలింగ్
కుప్పం, పలమనేరు నియోజకవర్గాల పరిధిలోని 9 మండలాల్లో ఏకగ్రీవాలు మినహా 177 సర్పంచ్ స్థానాలు, 1,196 వార్డు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 4,11,158 మంది ఓటర్లకు గాను 3,42,798 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లాలో 83.37 శాతం పోలింగ్ నమోదైంది. బైరెడ్డిపల్లె (85.94%), గుడుపల్లె (85.38%), కుప్పం (85.31%), పెద్దపంజాణి (84.23%), శాంతిపురం (83.11%) మండలాల్లో ఓటర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటారు.
వైఎస్సార్‌సీపీ విజయబావుటా
పలమనేరు నియోజకవర్గంలో 20 సర్పంచ్ స్థానాలు, కుప్పం నియోజకవర్గంలో 18 స్థానాలను వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు కై వసం చేసుకుని తమ పట్టు నిలుపుకున్నారు. రెండు నియోజకవర్గాల్లోని మండలాల్లో వైఎస్సార్‌సీపీ మద్ధతుదారుల గెలుపు ఇలా..
నాలుగుసార్లు రీకౌంటింగ్
గుడుపల్లె మండలం ఓఏ కొత్తూరులో వైఎస్సార్‌సీపీ మద్దతుదారు కృష్ణవేణికి మొదట 48 ఓట్ల మెజారిటీ వచ్చినట్లు ప్రకటించారు. అయితే ఫలితం మార్చేందుకు ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్, చంద్రబాబు పీఏ శ్రీకాంత్ అధికారులపై ఒత్తిడి తెచ్చి, కేంద్రాన్ని మూసివేసి మంతనాలు జరిపారనే ఆరోపణలు వచ్చాయి. ఏకంగా నాలుగుసార్లు రీకౌంటింగ్ నిర్వహించినా చివరకు 7 ఓట్ల మెజారిటీతో కృష్ణవేణి గెలుపొందారు. అలాగే చీకటిపల్లెలో రీకౌంటింగ్ నిర్వహించినా వైఎస్సార్‌సీపీ మద్దతుదారు కస్తూరి 113 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. పొగురుపల్లెలోనూ రీకౌంటింగ్ అనంతరం వైఎస్సార్‌సీపీ మద్ధతుదారుడు సుబ్రమణ్యం 64 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం కూటమి కుట్రలకు చెంపపెట్టుగా మారింది.
జిల్లాలో నామినేషన్ల దశ నుంచే కూటమి నేతలు అధికార బలాన్ని విచ్చలవిడి గా వాడారన్న విమర్శలు వెల్లువెత్తాయి. అభ్యర్థులను అడ్డుకోవడం, నామినేషన్ పత్రాలు చించివేయడం, స్క్రూటినీలో అక్రమ తొలగింపులు, పోలింగ్ రోజు దౌర్జన్యాలతో ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టే యత్నాలు చేశారు. అయి నా సరే, గ్రామీణ ప్రజలు మాత్రం తమ మనసులోని మాటను ఓటు రూపంలో స్పష్టంగా చెప్పారు. అధికారం చేతిలో ఉన్నా ప్రజాభిమానం లేకపోతే ఫలితం ఇలాగే ఉంటుందని ఈ ఎన్నికలు తేటతెల్లం చేశాయి.
కౌంటింగ్‌లో
అడ్డంకుల
పర్వం
ఓట్ల లెక్కింపు సమయంలోనూ కూటమి నేతలు అడ్డంకుల పర్వానికి తెరతీశారు. శాంతిపురం మండలం కర్లగట్ట పంచాయతీ కౌంటింగ్ మధ్యలో విద్యుత్ సరఫరా నిలిపివేసి ఓట్ల కట్టలను తారుమారు చేశారని వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు ఆరోపించారు. నిరసన తెలిపిన స్థానికులపై పోలీసులు లాఠీచార్జి చేసి చెదరగొట్టారు. కోనేరుకుప్పంలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులకు ఆధిక్యం వచ్చినా, టీడీపీ మద్దతుదారు గెలిచినట్లు అధికారులు డిక్లరేషన్‌న్ ఇచ్చారని స్థానికులు ఆందోళనకు దిగారు. వారిని పోలీసులు బలవంతంగా బయటకు పంపారు. గుండిశెట్టిపల్లిలోని సొన్నేగానిపల్లె కేంద్రంలో వైఎస్సార్‌సీపీ మద్ధతుదారుకు స్పష్టమైన ఆధిక్యం వచ్చినా గంటపాటు ఫలితం ప్రకటించకుండా నిలిపివేశారు. ఓడిన వారిని గెలిపించేందుకు యత్నిస్తే రోడ్డుపైనే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామని మహిళలు హెచ్చరించడంతో అధికారులు వైఎస్సార్‌సీపీ మహిళా మద్ధతుదారైన సర్పంచ్ గెలుపును ప్రకటించారు. ఎంకే పురంలో వైఎస్సార్‌సీపీ మద్ధతుదారునికి మెజారిటీ రావడంతో టీడీపీ నేతలు గొడవకు దిగి 3 గంటల పాటు డిక్లరేషన్‌న్ ఇవ్వకుండా అడ్డుకున్నారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులు భారీగా మొహరించడంతో అధికారులు చివరకు ధ్రువీకరణ పత్రం అందజేశారు.


