టీడీపీ అరాచకాలు వాస్తవం | - | Sakshi
Sakshi News home page

టీడీపీ అరాచకాలు వాస్తవం

Nov 28 2026 12:32 AM | Updated on Nov 28 2026 12:32 AM

కుప్పం : స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి కుప్పం నియోజకవర్గంలో టీడీపీ నేతలు అరాచకాలకు పాల్పడడం వాస్తవమని ఎమ్మెల్సీ భరత్‌ స్పష్టం చేశారు. శుక్రవారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. పచ్చమూక దాడులు, దౌర్జన్యాలకు పాల్పడలేదని భవానీ మాల మీద ఒట్టు వేసి చెప్పగలరా అని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌కు సవాల్‌ విసిరారు. మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా నామినేషన్ల పరిశీలన రోజున వైఎస్సార్‌సీపీ కార్యకర్తులపై టీడీపీ గూండాలు దాడి చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. కౌంటింగ్‌ కేంద్రం నుంచి ఏడో వార్డు కౌన్సిలర్‌ అభ్యర్థి మనోహర్‌ను బలవంతంగా బయటకు పంపించి అక్రమాలకు పాల్పడలేదా అని నిలదీశారు. మున్సిపాలిటీ చైర్మన్‌ అభ్యర్థిని కిడ్నాప్‌ చేసి బెదిరించలేదా అని మండిపడ్డారు. ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి రామకుప్పం మండలంలో ఒక్క నామినేషన్‌ వేయకుండా టీడీపీ నాయకుడు ఆనంద రెడ్డి కర్ణాటకలోని కేజీఎఫ్‌ నుంచి రౌడీలను తీసుకుని వచ్చి గొడవలు సృష్టించా రని ఆరోపించారు. శాంతిపురం మండంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గెలిచిన ఎంపీటీసీ స్థానాల్లో కౌంటింగ్‌ కేంద్రాల నుంచి అభ్యర్థులకు బయటకు పంపి మీరు గెలిచినట్లు ప్రకటించుకోలేదా అని ప్రశ్నించారు. గుడుపల్లె మండలం సంగనపల్లె ఎంపీటీసీ సెగ్మెంట్‌ విశ్వనాథ్‌ను బలవంతంగా బయటకు తరమివేసి మీరు గెలిచినట్లు ప్రకటించుకోలేదా అని నిలదీశారు. గుండ్లసాగరం సెగ్మెంట్‌ జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కృష్ణమూర్తిపై దాష్టికం చేయలేదా అని విమర్శించారు. రాళ్లబూదుగూరు, ఎంకేపురం ఎంపీటీసీ సెగ్మెంట్‌ గెలిచిన అభ్యర్థులుపై అధికార బలం చూపించి దాడులు చేయలేదా అని స్పష్టం చేశారు. అన్నీ ప్రజలు గమనించారని, అందుకే పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి పట్టం కట్టారని వెల్లడించారు. భవానీ మాలలో ఉన్న కంచర్ల శ్రీకాంత్‌ భగవంతుడిపై ఒట్ట వేసి మా ఆరోపణలు అవాస్తవమని చెబితే రాజకీయాల నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ కుప్పం మండలం కన్వీనర్‌ మురుగేష్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement