మార్టూరులో అధికార జులుం | - | Sakshi
Sakshi News home page

మార్టూరులో అధికార జులుం

Nov 28 2026 1:32 AM | Updated on Nov 28 2026 1:32 AM

న్యాయం కోసం రోడ్డెక్కిన వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు పోలీసుల లాఠీచార్జి ఆగ్రహంతో రాళ్లు రువ్విన యువకులు ఇద్దరు పోలీస్‌ అధికారులకు గాయాలు వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి గెలిచినా విజేతగా టీడీపీ అభ్యర్థిని ప్రకటించిన అధికారులు

పోలీసుల మౌనం వెనుక అంతరార్థం ఏంటి?

మార్టూరు(యద్దనపూడి): మార్టూరు మండలంలో ఆటవిక పాలన యథేచ్ఛగా కొనసాగుతోంది. గురువారం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ బలపరచిన సర్పంచ్‌ అభ్యర్థి షేక్‌ గఫూర్‌ 200 ఓట్లకు పైగా మోజార్టీతో గెలిచినట్లు మెదట ప్రకటించిన ఎన్నికల అధికారులు టీడీపీ నాయకుల ఒత్తిడికి తలొగ్గి టీడీపీ అభ్యర్థి టి.వీరాంజనేయులు 74 ఓట్లతో గెలిచినట్లు అధికారికంగా ప్రకటించారు. ఇందుకు ఆగ్రహించిన వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు గురువారం రాత్రి 10 గంటల సమయంలో స్థానిక స్టేట్‌ బ్యాంకు సెంటర్‌లో సూమారు 300 మంది అధికారుల తీరును నిరసిస్తూ న్యాయం కావాలంటూ నినాదాలతో రోడ్డుపై ధర్నాకు దిగారు. ఈ క్రమంలో స్టేషన్‌ నుంచి ధర్నా ప్రదేశానికి చేరుకున్న ఏఎస్సై శ్రీనివాసరావు పథకం ప్రకారం ధర్నా చేయాల్సింది ఇక్కడ కాదూ లేవండి అంటూ నిరసనకారులను హైవే పైకి వెళ్లేలా దారి మరల్చినట్లు విశ్వసనీయ సమాచారం. కళ్లముందే వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి గెలిచినట్లు చెప్పిన అధికారులు కాసేపటికే మాట మార్చి టీడీపీ అభ్యర్థి గెలిచినట్లు డిక్లరేషన్‌ ఇవ్వటంపై ఆవేశంతో రగిలిపోతున్న వైఎస్సార్‌ సీపీ నాయకులు, మహిళలు సూమారు 400 మందికి పైగా 11 గంటల సమయంలో స్థానిక జాతీయ రహదారిపై మార్టూరు–ఒంగోలు మార్గంలో వాహనాలు నిలిపి ఆందోళన చేపట్టారు. మెదట నిరసన తెలుపుతున్న వారి వద్దకు చేరుకున్న యార్లగడ్డ శ్రీనివాసరావు ఆందోళన విరమించాల్సిందిగా వారిని ఉద్దేశించి మాట్లాడ సాగాడు. ముందుగా అనుకున్న పథకం ప్రకారం ఏఎస్పీ సుధాకర్‌, బాపట్ల డీఎస్సీ చంద్రమౌళి అక్కడకు వస్తూనే మహిళలు అని చూడకుండా విచక్షణ రహితంగా లాఠీచార్జ్‌ ప్రారంభించారు. కనీసం తమతో సంప్రదింపులు జరపకుండా అసలు ఏమి జరిగిందని.. తెలుసుకోకుండానే మహిళలపై పురుష పోలీసులతో లాఠీచార్జీ చేయటంతో ఆగ్రహించిన కొందరూ ముస్లిం యువకులు రాళ్లు విసిరారు. ఈ ఘటనలో ఏఎస్పీతో పాటు హోంగార్డు వాణిశ్రీకు గాయాలయ్యాయి. అలాగే పోలీస్‌లు జరిపిన లాఠీచార్జీలో 10 మందికి పైగా మహిళలకు, పురుషులకు సైతం గాయాలయ్యాయి. అప్పటికే రహదారిపై వందలాదిగా వాహనాలు నిలిచిపోవటంతో దీనికి తోడూ పోలీసులు లాఠీచార్జి చేపట్టడంతో నిరసనకారులు 12.30 ప్రాంతంలో ఇంటిబాట పట్టారు.

నిరసనకారులపై విచక్షణ రహితంగా దాడికి పాల్పడి యువకుల దాడిలో గాయపడిన ఇద్దరు పోలీస్‌ అధికారులు గాయపడినప్పటికీ శుక్రవారం వరకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం స్థానికంగా పలు అనుమానాలు హల్‌చల్‌ చేయడం గమనార్హం. దాడికి సంబంధించిన విషయమై వైఎస్సార్‌ సీపీకి చెందిన పలువురు ముఖ్యమైన సూమారు 20 మందికి పైగా నాయకులపై కేసు నమోదు చేయటం కోసం పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు ఈ కేసును సాకుగా చూపుతూ నాయకులను భయపెట్టి దౌర్జన్యంగా ప్రకటించిన మార్టూరు పంచాయతీ విషయమై వైఎస్సార్‌ సీపీ నాయకులను భయభ్రాంతులకు గురిచేసి నోరు మూయించాలనేది టీడీపీ ముఖ్యనేత ఆలోచనగా స్థానికంగా ఊహాగానాలు వినిపించడం గమనార్హం. అదేవిధంగా టీడీపీ ప్రకటించుకున్న మండలంలోని కోలలపూడి గ్రామంలో ఆందోళనకు దిగిన వైఎస్సార్‌ సీపీ నాయకులపై సీఐ శ్రీనివాసరావు విచక్షణ రహితంగా దాడికి పాల్పపడ్డాడు. ఈ లాఠీచార్జిలో స్థానిక వైఎస్సార్‌సీపీ దళిత నాయకుడు సరిమళ్ల వేణు కాలు విరిగింది. కారణాలు ఏమైనప్పటికీ అధికారులు ఒక మెట్టు దిగి ఎట్టకేలకు కోలలపూడి సర్పంచ్‌గా వైఎస్సార్‌సీపీ బలపరచిన సర్పంచ్‌ అభ్యర్థి కె.వెంకటరత్నం 2 ఓట్ల మోజార్టీతో విజేతగా ప్రకటించటం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement