పెత్తనపు పరీక్షలు! | - | Sakshi
Sakshi News home page

పెత్తనపు పరీక్షలు!

Nov 10 2026 1:49 AM | Updated on Nov 10 2026 1:49 AM

పెత్తనపు పరీక్షలు! ఏఎన్‌యూలో సంస్కరణల పేరిట ఇష్టారాజ్యం మంగళవారం శ్రీ 10 శ్రీ నవంబర్‌ శ్రీ 2026 సాక్షి ప్రతినిధి, గుంటూరు: పరీక్షల్లో సంస్కరణలు, పారదర్శకత, జవాబుదారీతనం వంటి వాటిని సాకుగా చూపుతూ ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో కొందరు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తీరు యూనివర్సిటీ ప్రతిష్టను దిగజార్చడంతోపాటు యూనివర్సిటీ ఆర్థిక వ్యవస్థకు గొడ్డలిపెట్టులా మారింది. ఏ వ్యవస్థలో అయినా పారదర్శకత ముఖ్యం అదీ పరీక్షల వ్యవస్థలో అయితే మరీ ముఖ్యం కానీ నిబంధనల అమలు, నిజాయితీ వంటి వాటిని బూచిగా చూపిస్తూ కొందరు అధికారులు తమ ఆధిపత్యాన్ని, పెత్తందారీతనాన్ని ప్రదర్శించడం యూనివర్సిటీ ఖ్యాతిని మసకబార్చుతోంది. విద్యార్థుల జీవితాల్లో కీలకమైన పరీక్షల వ్యవస్థను తమ చేతుల్లోకి తీసుకుని ఇష్టారాజ్యంగా వ్యవహిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకే యూనివర్సిటీలో రెగ్యులర్‌ పరీక్షల నిర్వహణలో ఒకలా, దూరవిద్య పరీక్షల్లో మరోలా వ్యవహరిస్తూ కొందరు అధికారులు తమ రెండుకళ్ల సిద్ధాంతాన్ని అమలు చేస్తున్నారని దీని ద్వారా యూనివర్సిటీ పరువు పోతుండటంతోపాటు ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతోందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఒడిశా బీఈడీ పరీక్షల మాఫియా ఒత్తిడితో... ఇటీవల కోర్టు ఉత్తర్వుల సాకుతో స్పెషల్‌ బీఈడీ పరీక్షలు ఇష్టారాజ్యంగా నిర్వహించడం వంటి ఘటనలూ వెలుగులోకి వచ్చాయి. హడావుడి పరీక్షల నిర్వహణ వెనుక ఒడిశా రాష్ట్ర బీఈడీ పరీక్షల మాఫియా ఉందని, ఒడిశాలో పిలిస్తే ఏఎన్‌యూ పరిధిలో కాసులు గలగలా మంటున్నాయని దీని కారణంగానే ఒడిశా విద్యార్థులకు కావల్సిన విధంగా కొందరు ఏఎన్‌యూ అధికారులు అడుగులకు మడుగులొత్తుతున్నారనే వాదనలూ వినిపిస్తున్నాయి. రెగ్యులర్‌ పరీక్షలలో గతంలో ఏ ఆరోపణ వచ్చినా బాధ్యులపై యూనివర్సిటీ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవడంతోపాటు పరీక్షల నిర్వహణ అధికారులను తప్పించిన సందర్భాలూ ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఈ అడ్డదారులకు ఊతమిస్తున్న ఓ ఉత్తమ అధ్యాపకుడికి యూనివర్సిటీకి చెందిన కొందరు ఉన్నతాధికారులు కొమ్ముకాస్తున్నారనే విమర్శలూ ఉన్నాయి. నియంతృత్వ ధోరణి దూరవిద్య పరీక్షల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయంటూ ఈ విడత పరీక్షలు కేవలం ప్రభుత్వ, ఎయిడెడ్‌ కళాశాల్లో నిర్వహించాల్సిందేనని వారిరువు పట్టుబట్టడం వల్లనే పరీక్షల నిర్వహణకు మూడు నెలలపైగా ఆలస్యం అయ్యిందని దూరవిద్యాకోర్సులు చదివే విద్యార్థులు, అధ్యయన కేంద్రాల నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్‌ ఉండటం, ప్రభుత్వ కళాశాలల్లో పరీక్షల నిర్వహణకు అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటన్నింటినీ పరిగణంలోకి తీసుకోకుండా తాము చెప్పింది జరగాల్సిందేనన్నట్లుగా ఈనెల 11వ తేదీ నుంచి దూరవిద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రతి రోజూ ఉదయం 8 నుంచి 11 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామని కూడా ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే విద్యార్థులే దూరవిద్యాకోర్సులు ఎక్కువగా చదువుతుంటారు. ప్రభుత్వ కళాశాలలకు చాలా దూరంగా ఉండే విద్యార్థులు ఉదయం 8 గంటలకల్లా పరీక్షా కేంద్రాలకు ఎలా చేరుకుంటారనే కనీస అవగాహన కూడా లేకుండా నియంతృత్వంగా పరీక్షల నిర్వహణ వెనుక కుట్రకోణం దాగిఉందనే ఆరోపణలూ ఉన్నాయి. ● ఇన్నివేధింపుల నడుమ ఏఎన్‌యూ కింద అధ్యయన కేంద్రాలు నడపలేమని మరొక యూనివర్సిటీకి బదిలీ అవుదామని అధ్యయన కేంద్రాల నిర్వాహకులందరూ ఇటీవల సమావేశమై నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఆ సమావేశంలోనే ఓ అధ్యయన కేంద్రం నిర్వాహకుడు ఏఎన్‌యూ బీఈడీ పరీక్షల్లో ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయో రాష్ట్రం మొత్తం తెలుసు కానీ కావాలనే సంస్కరణల పేరుతో కొందరు యూనివర్సిటీ అధికారులు దూరవిద్య వ్యవస్థను విచ్చినం చేస్తూ ఏఎన్‌యూ ఆర్థిక వ్యవస్థకు వెన్నుపోటు పొడుస్తున్నారంటూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

న్యూస్‌రీల్‌

సంస్కరణల పేరుతో వెన్నుపోటు

యూనివర్సిటీ వ్యవస్థను సరిచేస్తా, పరీక్షల నిర్వహణ అంటే ఆషామాషీనా తప్పుజరిగితే సహించేదిలేదు అంటూ హడావుడి చేసే యూనివర్సిటీ ఓ ఉన్నతాధికారి, దూరవిద్య వ్యవస్థ మొత్తం తన కనుసన్నల్లో నడవాల్సిందే పరీక్షల వ్యవస్థకు కూడా నేనే బాస్‌ని అనే దూరవిద్యాకేంద్రానికి చెందిన ఒక ఉన్నతాధికారి ఇద్దరు కలిసి దూరవిద్య పరీక్షల పేరుతో యూనివర్సిటీకి వెన్నుపోటు పొడుస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దూరవిద్య పరీక్షల్లో జరిగే చిన్నచిన్న తప్పులను సాకుగా చూపి పరీక్షల వ్యవస్థనంతా తమ గుప్పెట్లోకి తెచ్చుకోవాలని తద్వారా ఆర్థికంగా మరింత లబ్ధిపొందాలనే కుట్రతోనే సంస్కరణల పేరుతో గత దూరవిద్య పరీక్షల్లో తనిఖీ బృందాల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా హడావుడి చేసి దూరవిద్య అధ్యయన కేంద్రాల నిర్వాహకులను భయభ్రాంతులకు గురిచేశారు. అంత హడావుడి చేసిన అధికారులు చివరకు కంటితుడుపు చర్యలతో ముగించేయడం కొసమెరుపు.

రెగ్యులర్‌ పరీక్షల్లో అక్రమాలు

తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో పలు రెగ్యులర్‌ పీజీ, వృత్తి విద్యాకోర్సుల పరీక్షల నిర్వహణలో భారీగా అవకతవకలు, అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. తప్పుల తడకగా ప్రశ్నాపత్రాలు, ఒక ప్రశ్నాపత్రానికి బదులుగా మరొక ప్రశ్నాపత్రం విద్యార్థులకు ఇవ్వడం, చేతి రాతతో ఉన్న ప్రశ్నాపత్రాలు ఇవ్వడం వంటివి సర్వసాధారణంగా మారింది. ఏడాదిన్నర క్రితం యూనివర్సిటీ పరిధిలో బీఈడీ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రం పరీక్షకు ముందురోజే లీకై వాట్సాప్‌లలోకి రావడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై అప్పట్లో పెదకాకాని పోలీస్‌ స్టేషన్‌లో పోలీసు కేసుకూడా నమోదు చేసి హడావుడి చేశారు. కానీ చర్యలేమీలేవు.

ఇంద్రకీలాద్రిపై దీపావళి వేడుకలు

పులిచింతల సమాచారం

నిమ్మకాయల ధరలు

బాపట్ల
ఏఎన్‌యూలో సంస్కరణల పేరిట ఇష్టారాజ్యం

7

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై ఆదివారం దీపావళి వేడుకలను వైభవంగా నిర్వహించారు. సాయంత్రంస్వామి వార్లకు పంచహారతుల సేవ నిర్వహించారు.

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 28.2730 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కులు లీకేజీల ద్వారా వెళుతుంది.

తెనాలి: తెనాలి మార్కెట్‌యార్డులో సోమవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.4500, గరిష్ట ధర రూ.6800, మోడల్‌ ధర రూ.5500 వరకు పలికింది.

పరీక్షల నిర్వహణలో

విపరీత ధోరణులు

రెగ్యులర్‌ పరీక్షల్లో అక్రమాలకు

అందలం

ఒడిశాలో పిలిస్తే ఏఎన్‌యూ

పరిధిలో పలుకుతున్న కాసులు

అక్రమాలకు పెద్దపీఠ వేస్తున్న

‘ఉత్తమ అధ్యాపకుడి’కి వత్తాసు

లేని అధికారాన్ని ఆపాదించుకుని

వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తున్న

కొందరు అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement