మరణంలోనూ వీడని స్నేహ బంధం | - | Sakshi
Sakshi News home page

మరణంలోనూ వీడని స్నేహ బంధం

Nov 10 2026 1:49 AM | Updated on Nov 10 2026 1:49 AM

పెదకాకాని వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

జాతీయ రహదారిపై డివైడర్‌ను ఢీ కొన్న బైక్‌

ఇద్దరు యువకులు దుర్మరణం

అతివేగమే ప్రమాదానికి కారణం

పెదకాకాని: బైక్‌ అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొని ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన పెదకాకాని వద్ద జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో వేముల సర్వేంద్ర(22), దావులి వెంకటేష్‌(23) మృతి చెందారు. స్థానికులు, పోలీసుల నుంచి సేకరించిన సమాచారం.. కృష్ణాజిల్లా, ఇబ్రహీంపట్నం మండలం, దొనబండకు చెందిన వేముల సర్వేంద్ర, దావులి వెంకటేష్‌ స్నేహితులు. సమీపంలోని స్టీల్‌ కంపెనీలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. సోమవారం ఇబ్రహీంపట్నం నుంచి గుంటూరు జిల్లా పేరేచర్లలోని బంధువుల ఇంటికి బయలు దేరారు. వారు ప్రయాణిస్తున్న బైక్‌ పెదకాకాని గ్రామ శివారులోకి పల్లాలమ్మ చెరువు వద్దకు చేరుకునే సరికి అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొంది. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న సర్వేంద్ర(22), వెంకటేష్‌(23) అక్కడికక్కడే మృతి చెందారు. అతివేగంతో బైక్‌ డివైడర్‌ను ఢీ కొనడంతో బలమైన గాయాలై మెదడు, పేగులు రోడ్డుపై పడ్డాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ప్రమాద కారణాలపై దర్యాప్తు చేపట్టారు. మృతుడు వెంకటేష్‌ తండ్రి ఏడాది కిందట తండ్రి మరణించగా తల్లి, అన్న, ముగ్గురు అక్కచెల్లెళ్లు ఉన్నారు. అలానే సర్వేంద్రకు తల్లిదండ్రులతో పాటు సోదరుడు ఉన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబసభ్యులు, బంధువుల ఆర్తనాదాలు స్థానికుల హృదయాలను కలచివేశాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సర్వేంద్ర తండ్రి రాజగోపాల్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పెదకాకాని సీఐ టీపీ నారాయణస్వామి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement