టూ వీలర్‌ షోరూమ్‌లో అగ్నిప్రమాదం | - | Sakshi
Sakshi News home page

టూ వీలర్‌ షోరూమ్‌లో అగ్నిప్రమాదం

Nov 10 2026 1:49 AM | Updated on Nov 10 2026 1:49 AM

తెనాలిరూరల్‌: దీపావళి రోజు తెనాలిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. టూ వీలర్‌ షోరూమ్‌లో మంటలు రేగి నాలుగు వాహనాలు దగ్ధం అయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పింది. పట్టణ గంగానమ్మపేటలోని అలవల మోటార్స్‌ టూ వీలర్‌ షోరూంలో ఆదివారం రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో షోరూమ్‌లో ఉన్న నాలుగు బైక్‌లు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సిబ్బంది సకాలంలో స్పందించడంతో మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో నాలుగు వాహనాలు పూర్తిగా కాలిపోయినట్లు షోరూమ్‌ యజమాని సుధాకర్‌ రాజు తెలిపారు. ఇతర ఆస్తి నష్టం కూడా జరిగినట్లు సమాచారం. కాగా, సోమవారం మధ్యాహ్నం క్లూస్‌ టీం తెనాలికి చేరుకుని అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించింది. ప్రమాదానికి గల కారణాలను గుర్తించేందుకు ఘటనా స్థలంలో ఆధారాలను సేకరించింది. ప్రాథమికంగా విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. మరోవైపు, సర్వీస్‌ సెంటర్‌లో ద్విచక్ర వాహనాల మరమ్మతులకు ఉపయోగించే ఇంజిన్‌ ఆయిల్‌ డబ్బాలు నిల్వ ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించి ప్రమాద తీవ్రత పెరిగినట్లు తెలుస్తోంది. దీపావళి సందర్భంగా స్థానికులు బాణసంచా కాల్చ, టపాకాయలు షోరూమ్‌ వెనుక వైపు ఉన్న కిటికీ నుంచి లోపలికి పడడంతో మంటలు చెలరేగి ఉంటాయన్న వాదన వినిపిస్తోంది. టూ టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సుమారు రూ. నాలుగు లక్షల ఆస్తి నష్టం సంభవించి ఉంటుందని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement