న్యూస్‌రీల్
ఎన్నికల్లో కూటమి నేతల దౌర్జాన్యాలు, రిగ్గింగ్ పోలీసులను అడ్డుపెట్టుకుని యథేచ్ఛగా అరాచకాలు కౌంటింగ్ రోజు అభ్యర్థులు, ఏజెంట్లను లాగిపడేసిన వైనం మంత్రి నారా లోకేష్ నియోజకవర్గంలో అభ్యర్థుల నెట్టివేత వైఎస్సార్ సీపీ గెలిచిన మూడు స్థానాలూ తమ ఖాతాలో వేసుకున్న వైనం బాపట్లలోనూ రెండోచోట్ల వైఎస్సార్ సీపీ గెలిచినా టీడీపీ గెలిచినట్లు ప్రకటన
కలెక్టర్ ఆదేశాలతో వైఎస్సార్ సీపీ, స్వతంత్ర అభ్యర్థుల గెలుపు ప్రకటన
బాపట్ల జిల్లాలోని బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం–1 వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేసిన అట్ల వెంకటేశ్వరమ్మ (వైఎస్సార్ సీపీ ఎంపీపీ అభ్యర్థి) మూడు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అయితే రీకౌంటింగ్ పేరుతో హడావుడి చేసి ఫలితాలను తారుమారు చేసిన అధికారులు... టీడీపీ అభ్యర్థి పిట్టు పావని రెడ్డి విజయం సాధించినట్లుగా ప్రకటించారు.
అదే నియోజకవర్గంలోని పిట్టలవానిపాలెం మండలం అల్లూరు వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేసిన ఉప్పు రాణి (ఎస్టీ) ఒక్క ఓటు మెజార్టీతో విజయం సాధించారు. అయితే ఈ విజయాన్ని జీర్ణించుకోలేని టీడీపీ నేతలు రీకౌంటింగ్ పేరుతో గందరగోళం సృష్టించారు. అధికారులు సైతం టీడీపీ నేతలకు తొత్తులుగా మారి, మూడు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు మరిచిపోయామని చెప్పారు. వాటిని కలిపి రెండు ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి గున్నం సముద్రాలు గెలిచినట్లు ప్రకటించారు. ఈ సమయంలో అక్కడకు వచ్చిన వైఎస్సార్ సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. అయినా లెక్కచేయని అధికారులు టీడీపీ అభ్యర్థులు గెలిచినట్లు ప్రకటించారు.
బాపట్ల మండలం గుడిపూడి వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ అభ్యర్థి బోయిన వసంత (బీసీ ) నాలుగు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అయితే ఫలితాలను ప్రకటించకుండా టీడీపీ నాయకులు అధికారులపై ఒత్తిడి తెచ్చి మూడుసార్లు రీకౌంటింగ్ నిర్వహించారు. రెండుసార్లు వసంతకు మెజార్టీ రావడంతో, మూడోసారి అధికారులపై ఒత్తిడి తెచ్చి రెండు చెల్లని ఓట్లను కూడా కలిపారు. అయినప్పటికీ ఒక్క ఓటు మెజార్టీ వచ్చింది. అధికారులు, టీడీపీ నేతల బెదిరింపులకు ఆమె లొంగకపోవడంతో ఒక్క ఓటు మెజార్టీతో ఆమె గెలిచినట్లు అధికారులు డిక్లేర్ చేశారు.
అదే మండలానికి చెందిన పోతురాజుపాలెం వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ అభ్యర్థి మధుప్రోలు తిరుపతిరెడ్డి నాలుగు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రెండు గంటల పాటు ఫలితాన్ని ప్రకటించకుండా రెండుసార్లు రీకౌంటింగ్ నిర్వహించారు. అయినప్పటికీ నాలుగు ఓట్ల మెజార్టీ రావడంతో పాటు, టీడీపీ నేతల బెదిరింపులకు లొంగకపోవడంతో చేసేదేమీ లేక అధికారులు నాలుగు ఓట్ల మెజార్టీతో తిరుపతిరెడ్డి గెలిచినట్లు ప్రకటించారు.
బాపట్ల జిల్లాలోనూ ఇదే పరిస్థితి
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి నాయకులు అనుసరించిన తీరు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేవిధంగా ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా విషం చల్లే విధంగా రాజకీయాలు చేయటం మనం సమాజానికి ఏం నేర్పిస్తున్నామో అర్థం కావటం లేదు. అసెంబ్లీ ఎన్నికలను మించిన విధంగా ప్రతి చోటా ఏదోవిధంగా అధికారాన్ని చేపట్టాలనే ఉద్దేశంతో ఎంతటికై నా తెగించటం చూస్తుంటే బాధకలిగిస్తుంది. గెలిచిన అభ్యర్థులను కూడా ఓడిపోయినట్లు చూపించటం కూటమికే సాధ్యమైంది.
–మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి
సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల దగ్గర నుంచి కౌంటింగ్ వరకు అధికార పార్టీ నేతలు పోలీసులను అడ్డుపెట్టుకుని అవే కుట్రలు సాగిస్తూనే ఉన్నారు. దౌర్జన్యాలకు తెగబడడం, ఏజెంట్లను బెదిరించడం, కౌంటింగ్ కేంద్రాల నుంచి అభ్యర్థులను సైతం బయటకు లాగిపడేయడం, ఫలితాలను తారుమారు చేసే స్థాయికి దిగజారారు. అధికార పార్టీ నేతలకు అటు పోలీసులు, చివరకు పోలింగ్ అధికారులు సైతం తోడై గెలిచిన అభ్యర్థులను ఓడినట్లు ప్రకటించి, ఓడిన అభ్యర్థులను గెలిచినట్లుగా డిక్లేర్ చేశారు. నిన్నమొన్నటి వరకు ఈ దౌర్జన్యాలు కేవలం పల్నాడు జిల్లాకే పరిమితమని అనుకున్నారు. కానీ గుంటూరు, బాపట్ల జిల్లాల్లోని అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, పోలీసు అధికారులు, చివరికి పోలింగ్ అధికారులు సైతం అరాచకాలకు తెగబడ్డారు. ప్రజాస్వామ్యవాదులు సిగ్గుపడే విధంగా అధికారులు, అధికార పార్టీ నేతలతో కుమ్మకై ్క సాగించిన అరాచక పర్వం అంతా ఇంతా కాదు. గెలుపొందిన వారిలో అధికంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలు ఉన్నప్పటికీ, కౌంటింగ్ కేంద్రాల నుంచి ఈడ్చిపడేసి దౌర్జన్యాలకు దిగారు. పోలీసులు నేరుగా బెదిరించి గెలిచిన అభ్యర్థులను ఓడించారు.
మంత్రి లోకేష్ నియోజకవర్గంలోనే ఇలా...
ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాల మండలంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ప్రకటించినప్పటి నుంచి వైఎస్సార్ సీపీకి మద్దతుగా నిలిచిన వారిపై అక్రమ కేసులు బనాయించి జైళ్లలో వేశారు. పోలీసులు నేరుగా అభ్యర్థులను బెదిరించడం, పోలింగ్ రోజు వైఎస్సార్ సీపీ ఏజెంట్లను బయటకు లాగిపడేసి రిగ్గింగ్‌లకు పాల్పడటం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇన్ని జరిగినా అధికార పార్టీని ఎదుర్కొని వైఎస్సార్ సీపీ అభ్యర్థులు ఎన్నికల సమరంలో నిలిచి గెలిచారు. ఓటమిని జీర్ణించుకోలేని చిన్నబాబు తమ పార్టీ గూండాలతో పాటు పోలీసులు, పోలింగ్ అధికారులను సైతం ప్రభావితం చేశారు. గెలిచిన ముగ్గురు ఎంపీటీసీ అభ్యర్థులను, వారి కౌంటింగ్ ఏజెంట్లను కూడా బయటకు లాగిపడేసి ఆయా స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు గెలిచినట్లు ప్రకటించేశారు.
అడ్డంకులు ఎదుర్కొని గెలిచి...
గుంటూరు రూరల్ మండల పరిధిలోని వెంగళాయపాలెం–1 ఎంపీటీసీ వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఇందిర కళ్యాణి ఎన్నికల రోజు నుంచే అధికార పార్టీ నేతల దౌర్జన్యాలు, పోలీసుల అరాచకాలను ఎదుర్కొంటూ ముందుకు సాగారు. గురువారం రాత్రి ఎన్నికలు ముగిశాక పోలింగ్ బాక్సులను తరలిస్తున్న సమయంలో మార్గమధ్యంలో బ్యాలెట్ బాక్సులు మార్చేందుకు యత్నిస్తున్న అధికారులను నిలదీశారు. ఈ సందర్భంగా జరిగిన గొడవలు, అక్రమ కేసుల వ్యవహారం అందరికీ తెలిసిందే. శనివారం జరిగిన కౌంటింగ్‌లోనూ ఆమెను ఓడించేందుకు అటు అధికార పార్టీ నేతలు, ఇటు పోలింగ్ అధికారులు శతవిధాలా ప్రయత్నించారు. 40 ఓట్ల మెజార్టీతో ఆమె విజయం సాధించినప్పటికీ డిక్లరేషన్ ఇవ్వకుండా మూడు గంటల పాటు హైడ్రామా నడిపారు. మూడుసార్లు రీ కౌంటింగ్ చేసినా ఆమెకు మెజార్టీ వచ్చింది. ఎంత బెదిరించినా ఆమె వెనక్కి తగ్గలేదు. దీంతో చేసేదేమీ లేక నల్లపాటి ఇందిర కళ్యాణి 40 ఓట్ల మెజార్టీతో విజయం సాధించినట్లు అధికారులు డిక్లేర్ చేయాల్సి వచ్చింది.
వైఎస్సార్ సీపీ అభ్యర్థి గెలుపు ఖరారు చేయాలని ఆదేశిస్తున్న కలెక్టర్ వినోద్‌కుమార్
రేపల్లె కౌంటింగ్ కేంద్రంలో కలెక్టర్‌కు టీడీపీ ఏజెంట్ల అభ్యంతరాలను వివరిస్తున్న అధికారులు
సత్తెనపల్లిలో ఏర్పాటు చేసిన తాత్కాలిక బాణసంచా దుకాణాలు


