తెనాలిరూరల్: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ బి.నయనతార ఆధ్వర్యంలో కాంటినెంటల్ కాఫీ లిమిటెడ్లో మిథనాల్ ఉపయోగించే విధానాన్ని పరిశీలించారు. దుగ్గిరాల మండలంలోని చిలువూరు, దుగ్గిరాల వైన్ షాపులలో మద్యం విక్రయాలను ఏపీ సురక్ష యాప్ ద్వారా తనిఖీ చేశారు. తనిఖీలలో భాగంగా తెనాలి మండల పరిధిలోని సోమసుందరపాలెంలో మద్యం అక్రమ నిల్వలు కలిగి ఉన్న వ్యక్తిని గుర్తించి అరెస్ట్ చేసినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.


