పంట కాలువలో ఆర్టీసీ బస్సు బోల్తా | - | Sakshi
Sakshi News home page

పంట కాలువలో ఆర్టీసీ బస్సు బోల్తా

Oct 27 2026 2:02 AM | Updated on Oct 27 2026 2:02 AM

పర్చూరు (చినగంజాం): డ్రైవర్‌ నిద్రమత్తులో బస్సును నడపడంతో అదుపుతప్పి రోడ్డు పక్కన పంట కాలువలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ సంఘటన సోమవారం మండలంలోని అన్నంబొట్లవారిపాలెం జాతీయ రహదారిపై జరిగింది. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు అందించిన సమాచారం ప్రకారం.. చీరాల నుంచి నర్సరావుపేట వైపు వెళ్తున్న చిలకలూరిపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వాడరేవు–పిడుగురాళ్ల జాతీయ రహదారిపై అన్నంబొట్లవారిపాలెం గ్రామానికి సమీపంలో రోడ్డు మార్జిన్‌ దాటి పంట కాలువలోకి బోల్తా కొట్టింది. డ్రైవర్‌ నిద్ర మత్తులో ఉండటంతో బస్సు ప్రమాదానికి గురైనట్లు ప్రయాణికులు తెలిపారు. బస్సు పక్కకు వెళ్తుండగా కండక్టర్‌, బస్సులో ముందుకూర్చున్న ప్రయాణికులతో సహా పెద్దగా కేకలు వేశారు. అప్పటికే బస్సు కాలువలోకి దూసుకెళ్లి బోల్తా కొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 17 మంది ప్రయాణికులు ఉండగా వారిలో ఇద్దరు మహిళలకు మినహా మిగిలిన వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. గాయాలపాలైన లక్కె వసంత, చిన్నం పుష్పావతిలను హూటాహుటిన 108 వాహనంలో చిలకలూరిపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకు మార్టూరు రూరల్‌ సీఐ బి.నాగభూషణం, ఎస్‌ఐ అంకమ్మరావులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.

ఇద్దరు మహిళలకు స్వల్ప గాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement