నెహ్రూనగర్: మద్యం అక్రమ రవాణా, నిషేధిత వస్తువుల తరలింపును అరికట్టే లక్ష్యంతో వాస్కోడిగామా రైలులో ఎకై ్సజ్ అధికారులు బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ కె.రవికుమార్ ఆధ్వర్యంలో ఎస్ఐలు పి.తిరుమలేశ్వరరావు, కె.షరీఫ్, టైనీ ఎస్ఐ వి.పుష్ప, సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. రైలులోని వివిధ కోచ్‌లలో ప్రయాణికుల సామగ్రి, అనుమానాస్పద వస్తువులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అక్రమ మద్యం రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచిన అధికారులు, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎకై ్సజ్‌శాఖ ఆధ్వర్యంలో ఇటువంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయన్నారు.
పెదకాకానిలో జనసేన సెగ్మెంట్లో టీడీపీ పోటీ
పెదకాకాని: పెదకాకాని మండలంలో జనసేన, టీడీపీ నాయకుల మధ్య స్థానిక ఎన్నికల వార్ మొదలైంది. పెదకాకాని మండలంలోని 21 ఎంపీటీసీ సెగ్మెంట్లలో ఐదు సెగ్మెంట్లు జనసేన పార్టీ బీ ఫారంతో నామినేషన్లు వేయగా.. గాజు గ్లాసు గుర్తు కూడా కేటాయించారు. ఒక పక్కన కూటమితో కలసి ఎన్నికల్లో పోటీ చేద్దాం అని చెబుతూనే పెదకాకాని 4 సెగ్మెంట్లలోనూ, కొప్పురావూరులోనూ జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న సెగ్మెంట్లో టీడీపీ అభ్యర్థులు పోటీ చేయడం దురదృష్టకరమని పలువురు జనసేన నాయకులు పేర్కొంటున్నారు. జనసేన అభ్యర్థులను ఆదరించాలని కోరుతున్నారు. ఎన్నికలు వచ్చినపుడు జనసేన నాయకులు గుర్తుకు వస్తే తగిన సమాధానం చెప్పడానికి సిద్ధంగానే ఉన్నామని జనసైనికులు పేర్కొంటున్నారు.
48 గంటల ముందు నుంచే మద్యం దుకాణాలు బంద్ చేయాలి
పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల
నరసరావుపేట: పోలింగ్‌కు 48 గంటల ముందు నుంచి మద్యం దుకాణాలను బంద్ చేయాలని పల్నాడు జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి డాక్టర్ కృతికా శుక్ల ఆదేశాలు జారీ చేశారు. నవంబర్ ఒకటవ తేదీన మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా అక్టోబర్ 30న సాయంత్రం ఐదు గంటల నుంచి నవంబర్ ఒకటి సాయంత్రం ఐదు గంటల వరకు మద్యం విక్రయాలపై నిషేధం విధించినట్లు తెలిపారు. నవంబర్ 3న కౌంటింగ్ దృష్ట్యా ఉదయం ఎనిమిది గంటల నుంచి కౌంటింగ్ పూర్తయ్యేవరకు మద్యం విక్రయాలు జరపకూడదని పేర్కొన్నారు.
బకింగ్‌హామ్ కెనాల్లో గుర్తుతెలియని మృతదేహం
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని ఎన్టీఆర్ కరకట్ట బకింగ్‌హామ్ కెనాల్ బ్రిడ్జి సమీపంలో బుధవారం రాత్రి తాడేపల్లి పోలీసులు నీటిలో తేలియాడుతున్న మృతదేహాన్ని గుర్తించారు. ఎస్సై ప్రదీప్ తెలిపిన వివరాల ప్రకారం.. బకింగ్హమ్ కెనాల్లో ముళ్లచెట్లకు అడ్డుకుని మృతదేహం ఉందన్న స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకుని కాలువలో తేలియాడుతున్న మృతదేహాన్ని బయటకు తీశామన్నారు. మృతదేహం వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని, మృతుడు నల్లని దుస్తులు ధరించి ఉన్నాడని, తలకు నల్ల క్యాప్ పెట్టుకున్నాడని, ఫేస్‌కు పెట్టుకున్న మాస్క్ జారి మెడభాగంలోకి వచ్చిందన్నారు. మృతుడి వయస్సు సుమారు 35 సంవత్సరాలు ఉంటాయని, మృతదేహం వివరాలు తెలిస్తే తాడేపల్లి పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ కోరారు.
మద్యం దుకాణాల్లో
ఎకై ్సజ్ డైరెక్టర్ తనిఖీలు
నెహ్రూనగర్: రాష్ట్రంలో జరుగుతున్న కార్పొరేషన్, మున్సిపాలిటీల ఎన్నికల నేపథ్యంలో మద్యాన్ని నిరోధించే చర్యల్లో భాగంగా, ఎకై ్సజ్ శాఖ డైరెక్టర్ చామకూరి శ్రీధర్ బుధవారం గుంటూరు పట్టణంలోని పలు మద్యం దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా ఆయన మద్యం షాపుల్లోని మద్యం సీసాలను ‘ఏపీ సురక్ష’ యాప్ ద్వారా క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం దుకాణ సిబ్బందితో మాట్లాడి, రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్) అమల్లో ఉన్నందున రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ నిబంధనలకు లోబడి నడుచుకోవాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా ఎకై ్సజ్ శాఖ ఆఫీసర్ వి.అరుణ్‌కుమారి, అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఇ.మారయ్య బాబు, గుంటూరు–2 స్టేషన్ సీఐ వి.నరసింహారావు, ఎకై ్సజ్ సిబ్బంది పాల్గొన్నారు.
హత్య కేసులో నిందితుడిని కస్టడీకి కోరుతూ పిటిషన్
రెంటచింతల: మండలంలోని రెంటాల గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన విభాగం సంయుక్త కార్యదర్శి నవులూరి చెన్నారెడ్డి దారుణహత్య కేసులో నిందితుడైన మోర్తల ఉమామహేశ్వరరెడ్డిని ఐదు రోజుల కస్టడీకి కోరుతూ కారంపూడి సీఐ ఆవుల భాస్కర్ బుధవారం గురజాల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవల ఉమామహేశ్వరరెడ్డిని పోలీసులు ఐదు రోజుల కస్టడీకి కోరగా గురజాల కోర్టు జడ్జి అలేఖ్య ఒక రోజు 28వ తేదీ మధ్యాహ్నం నుంచి 29 మధ్యాహ్నం వరకు మాత్రమే అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పూర్తిస్థాయిలో నిందితుడిని విచారించడానికి సమయం సరిపోదని భావించిన సీఐ కోర్టు ఇచ్చిన కస్టడీని అమలు పరచలేదు. తిరిగి ఐదు రోజుల కస్టడీకి కోరుతూ మరో పిటీషన్ అందజేశారు.


