రెండున్నరేళ్లు.. ఇంకా కన్నీళ్లు | - | Sakshi
Sakshi News home page

రెండున్నరేళ్లు.. ఇంకా కన్నీళ్లు

Oct 1 2026 4:28 AM | Updated on Oct 1 2026 4:28 AM

గురువారం శ్రీ 1 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026 రెండున్నరేళ్లు.. ఇంకా కన్నీళ్లు ఎన్నికల హామీల అమలులో చంద్రబాబు సర్కారు విఫలం రేపల్లె: వేసవికాలం వచ్చిందంటే తాగునీటి కోసం ఇబ్బందులు పడే ప్రజలు... మరోవైపు చెత్త పేరుకుపోయి దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్న కాలనీలు... తీరప్రాంత గ్రామాల్లో ప్రతి తుఫాన్‌ వేళ భయంతో గడిపే మత్స్యకార కుటుంబాలు... చిన్నపాటి రోగం వచ్చినా చికిత్స కోసం గుంటూరు, విజయవాడకు పరుగులు తీసే పరిస్థితి. ఇదే నేటి రేపల్లె వాస్తవ చిత్రం. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని ఎన్నికల ముందు హామీల వర్షం కురిపించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండున్నరేళ్లు గడిచినా ఆ హామీలు గాలిలో కలిసిపోయాయన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనే అక్టోబర్‌ 1న సీఎం రేపల్లె పర్యటనకు రానుండటం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ కార్యక్రమాల కంటే ముందుగా రేపల్లె ప్రజల అసలు సమస్యలపై సీఎం ఏమి చెబుతారన్నదే ప్రధానాంశంగా మారింది. ఎన్నికల హామీల అమలు ఏదీ? 2024 ఎన్నికల సమయంలో రేపల్లె ప్రజల ముందుకు వచ్చిన చంద్రబాబు పలు కీలక హామీలు ఇచ్చారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటినా ఆ హామీలు అమలు కాలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీస చర్యలు కూడా ప్రారంభం కాకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రేపల్లెకు శాశ్వత డంపింగ్‌ యార్డ్‌ లేకపోవడంతో సేకరించిన చెత్తను ఇతర ప్రాంతాలకు తరలించాల్సిన పరిస్థితి కొనసాగుతోంది. పట్టణంలో రోజుకు రెండు పూటలా తాగునీరు అందించాల్సి ఉన్నా, గత కొన్నేళ్లుగా ఒక పూట మాత్రమే సరఫరా జరుగుతోంది. వేసవికాలంలో పలు కాలనీలకు నీరు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తీరప్రాంత గ్రామాల్లో తుఫాన్‌ షెల్టర్లు, రక్షణ వలయాలు లేక మత్స్యకార కుటుంబాలు ఏటా భయాందోళనలకు గురవుతున్నాయి. హార్బర్‌ అభివృద్ధి, కోల్డ్‌ స్టోరేజ్‌లు, ప్రాసెసింగ్‌ యూనిట్లు వంటి హామీలు ఇప్పటికీ కాగితాలకే పరిమితమయ్యాయని ఆరోపణలు ఉన్నాయి. కృష్ణానదికి వరదలు వచ్చిన ప్రతిసారి కరకట్ట గ్రామాల ప్రజలు నిద్రలేని రాత్రులు గడపాల్సిన పరిస్థితి నెలకొంది. కరకట్ట అభివృద్ధి పనులు ప్రారంభ దశకే చేరలేదని స్థానికులు అంటున్నారు. రేపల్లె ప్రభుత్వ వైద్యశాల కూడా ప్రాథమిక సేవలకే పరిమితమైందని, 100 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్‌ చేస్తామన్న చంద్రబాబు హామీలు నేటికీ అమలుకు నోచుకోలేదు. ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి పింఛన్ల పంపిణీ పేరుతో పర్యటనలు, కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రచారం చేసుకోవడమే తప్ప ప్రజల అసలు సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మాటలు కాదు, పనులు కావాలి అన్న స్వరం రేపల్లెలో బలంగా వినిపిస్తోంది. తాగునీటి సమస్య, చెత్త నిర్వహణ లోపాలు, తీర ప్రాంత భద్రతా సమస్యలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. ముఖ్యంగా మత్స్యకారులు తమకు ఇచ్చిన హామీలు అమలు కాలేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం పర్యటనతోనైనా పెండింగ్‌ ప్రాజెక్టులకు గ్రీన్‌ సిగ్నల్‌ లభిస్తుందా? లేక మరోసారి హామీలకే పరిమితమవుతారా? అన్న ప్రశ్నలు రేపల్లె ప్రజల్లో బలంగా వినిపిస్తున్నాయి. ఆగిన హార్బర్‌ అభివృద్ధి పనులు తీర ప్రాంత మత్స్యకారుల జీవనోపాధి కోసం గత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం రూ.451 కోట్లతో ప్రారంభించిన నిజాంపట్నం హార్బర్‌ రెండో దశ పనులు ప్రస్తుతం నిలిచిపోయాయి. ఎన్నికల నాటికి సుమారు 60 శాతం పూర్తైన ఈ ప్రాజెక్ట్‌ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మూలనపడింది. మత్స్యకారులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. నేడు రేపల్లెకు వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించి, నిలిచిపోయిన పనులను వెంటనే ప్రారంభించాలని మత్స్యకారులు కోరుతున్నారు.

న్యూస్‌రీల్‌

మహిళలను తరలించాలని ఆర్పీలపై ఒత్తిడి?

రేపల్లె: ముఖ్యమంత్రి సభ నేపథ్యంలో రేపల్లె ప్రాంతంలో మహిళలను పెద్ద సంఖ్యలో తరలించాలన్న ఒత్తిడి తెస్తున్నారని సమాచారం. ప్రతి ఆర్పీ (రీసోర్స్‌ పర్సన్‌) కనీసం 200 మంది మహిళలను సభకు తీసుకురావాల్సిందేనని సంబంధిత అధికారుల నుంచి సూచనలు, హెచ్చరికలు వచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విధంగా లక్ష్యాలు పూర్తి చేయకపోతే ఉద్యోగాలపై ప్రభావం తప్పదని చెప్పినట్లు చర్చ జరుగుతుండటంతో ఆర్పీల్లో ఆందోళన నెలకొంది. దీంతో కొంతమంది మహిళా ఆర్పీలు దీనికి నిరాకరించినట్టు సమాచారం. ప్రజల నుంచి కూడా ఈ అంశంపై తీవ్ర స్పందన వ్యక్తమవుతోంది. ‘ప్రతి చిన్న పనికి డబ్బులు వసూలు చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు... ఇప్పుడు మీ మీటింగ్‌లకు మేమెందుకు రావాలి?’ అంటూ పలువురు మహిళలు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. స్వచ్ఛందంగా వచ్చే వారినే సభలకు తీసుకెళ్లాలి తప్ప బలవంతపు తరలింపులు సరైనవి కావని వారు స్పష్టం చేస్తున్నారు. ప్రజాసంఘాలు కూడా ఈ వ్యవహారంపై స్పందిస్తూ, ప్రజలను ఒత్తిడి చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొంటున్నాయి. అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల స్వచ్ఛంద హాజరుతోనే విజయవంతం కావాలి, ఉద్యోగ భయంతో జన సమీకరణ చేయడం సరైన విధానం కాదని విమర్శిస్తున్నాయి.

సాగర్‌ నీటి మట్టం

నిమ్మకాయల ధరలు

పులిచింతల సమాచారం

బాపట్ల
గురువారం శ్రీ 1 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026
ఎన్నికల హామీల అమలులో చంద్రబాబు సర్కారు విఫలం

● నీటి ఎద్దడి, పారిశుద్ధ్యలేమి,

భద్రతాలోపాలపై ప్రజల ఆవేదన

● నేడు సీఎం పర్యటన

నేపథ్యంలో తెరపైకి ప్రజాసమస్యలు

● పింఛన్ల పంపిణీ ఆర్భాటం కంటే

ఇబ్బందులు తీర్చాలని డిమాండ్‌

7

మాచర్ల: నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు రిజర్వాయర్‌ నీటి మట్టం బుధవారం 536.80 అడుగులుగా ఉంది. ప్రస్తుతం 181 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంది.

తెనాలి: స్థానిక మార్కెట్‌యార్డులో బుధవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ఠ ధర రూ.6,500, గరిష్ఠ ధర రూ.9,500, మోడల్‌ ధర రూ.8 వేల వరకు పలికింది.

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నీటి నిల్వ 28.9587 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కుల నీరు లీకేజీల ద్వారా వెళుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement