జ్వరాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు | - | Sakshi
Sakshi News home page

జ్వరాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు

Oct 1 2026 4:28 AM | Updated on Oct 1 2026 4:28 AM

జ్వరాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు నేటి ఉదయం నుంచి పింఛన్ల్లు పంపిణీ వైకుంఠపురాన్ని సందర్శించిన దేవదాయశాఖ కమిషనర్‌

నిజాంపట్నం(రేపల్లె): జ్వరాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని బాపట్ల జిల్లా మలేరియా నివారణ అధికారి డాక్టర్‌ నాగార్జున పేర్కొన్నారు. మండలంలోని కూచినపూడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. ల్యాబ్‌లో నిర్వహిస్తున్న రక్త పరీక్షల రికార్డులను తనిఖీ చేశారు. కార్యక్రమంలో డాక్టర్‌ కిషోర్‌, ఎంపీహెచ్‌ఈఓ సాంబ శివరావు, సూపర్‌వైజర్‌ మురళి, ల్యాబ్‌ టెక్నీషియన్‌ సుజాత తదితరులు పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్‌ సాయికాంత్‌ వర్మ

గుంటూరు వెస్ట్‌: ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని గురువారం ఉదయం నుంచి నిర్వహించనున్నట్లు గుంటూరు జిల్లా కలెక్టర్‌ సీఎం సాయికాంత్‌ వర్మ తెలిపారు. ఈ మేరకు బుధవారం సంబంధిత అధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఒకటో తేదీన పింఛను తీసుకోలేని వారికి 3న అందజేస్తారని చెప్పారు. జిల్లాలో 2,50,576 మందికి పింఛన్లు కింద రూ.109.32 కోట్ల పంపిణీ చేస్తామన్నారు.

రైల్వేస్టేషన్‌ అభివృద్ధి పనులు పరిశీలించిన డీఆర్‌ఎం

నరసరావుపేట: రైల్వేస్టేషన్‌లో సుమారు రూ.47 కోట్ల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులను డీఆర్‌ఎం సుధేష్ణసేన్‌ బుధవారం పరిశీలించారు. ఆమె ప్రకాశం జిల్లా కంభం వెళ్లి తిరుగు ప్రయాణంలో నరసరావుపేట స్టేషన్‌లో ఆగారు. చేస్తున్న పనులను రైల్వే ఇంజినీర్లు, కాంట్రాక్టర్లు ఆమెకు వివరించారు. ఈ సందర్భంగా డీఆర్‌ఎం వారికి పలు సూచనలు చేశారు. సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తిచేయాలని ఆదేశించారు.

అమరావతి: ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రమైన వైకుంఠపురం వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దేవదాయ శాఖ కమిషనర్‌ రామచంద్రమోహన్‌ బుధవారం సందర్శించారు. తొలుత ఆలయ అధికారులను అర్చకులు కొండపైన వెంకటేశ్వర ఆలయంలోకి ఆహ్వానించారు. వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ వేదపండితులు ఆశీర్వచనం చేసి స్వామి శేషవస్త్రం, తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్శనలో ఆయన వెంట వైకుంఠపురం వెంకటేశ్వరాలయ ఈఓ విశ్వనాథ్‌ ఉన్నారు.

బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు

సత్తెనపల్లి: బాల్య వివాహం జరగకుండా అధికారులు చర్యలు చేపట్టిన సంఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో జరిగింది. వివరాలు .. పట్టణానికి చెందిన బాలిక ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియెట్‌ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఆ బాలిక తండ్రి అనారోగ్యంతో మంచంలో ఉండటంతో బాలికకు సత్తెనపల్లి మండలం పాకాలపాడు గ్రామానికి చెందిన యువకుడితో అక్టోబర్‌ 5న వివాహం చేసేందుకు బాలిక తల్లి నిర్ణయించింది. దీంతో సమాచారం అందుకున్న సీ్త్ర శిశు సంక్షేమ శాఖ సత్తెనపల్లి సూపర్‌వైజర్‌ పి.ప్రమీల, మహిళా పోలీస్‌ డి.నందిని, ఏఎన్‌ఎం లక్ష్మి, అంగన్‌వాడీ కార్యకర్త రోజారాణి ఆమె ఇంటికి వెళ్లి బాలిక తల్లికి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అయినా వివాహం చేయాల్సిందేనని పట్టు పట్టడంతో పట్టణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాలిక తల్లికి సీఐ నరహరి నాగమల్లేశ్వరరావు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఆమె బైండోవర్‌ పత్రాలపై సంతకం చేసేందుకు నిరాకరించింది. ఉదయం 11 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆయా శాఖల అధికారులు చర్చించినప్పటికీ బాలిక తల్లి బైండోవర్‌ కావడానికి అంగీకరించలేదు. దీంతో సీఐ నాగమల్లేశ్వరరావు జోక్యం చేసుకుని బాల్య వివాహం చేస్తే పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement