రేపల్లెలో సీఎం పర్యటనకు విస్తృత ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

రేపల్లెలో సీఎం పర్యటనకు విస్తృత ఏర్పాట్లు

Oct 1 2026 4:28 AM | Updated on Oct 1 2026 4:28 AM

రేపల్లెలో సీఎం పర్యటనకు విస్తృత ఏర్పాట్లు

రేపల్లె: పట్టణంలో గురువారం నిర్వహించనున్న ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను బుధవారం జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొలుసు పార్థసారథి సమీక్షించారు. హెలీప్యాడ్‌, ప్రజావేదిక, క్యాడర్స్‌ సమావేశం వేదికల ఏర్పాట్లను పర్యటనల సమన్వయ కర్త పి.వెంకటేష్‌, మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణ, జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌ కుమార్‌, జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్‌లతో కలిసి పరిశీలించారు. డీఎఫ్‌ఓ సౌజన్య, ఆర్డీఓలు బి.శ్రీదేవి, నరసింహారావు, ఎ.హరికుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ సాంబశివరావు, డీఎస్పీ అబ్దుల్‌ అజీజ్‌, పీడీలు బి.సింగయ్య, ఆనంద సత్యపాల్‌, వెంకటేశ్వరరావు, డీఎస్‌ఓ జగన్మోహన్‌ పాల్గొన్నారు.

నేడు పింఛన్ల పంపిణీ కార్యక్రమం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement