తాడేపల్లి రూరల్: అల్పపీడన ప్రభావంతో రెండు రోజుల నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజ్ వద్ద పూర్తిస్థాయి నీటిమట్టం చేరుకుంది. గురువారం రాత్రి 12 అడుగులకు నీటిమట్టం చేరడంతో దిగువకు ప్రకాశం బ్యారేజ్ నుంచి నీటిని విడుదల చేస్తున్నట్లు ఏఈ రాజేష్ తెలిపారు. ప్రస్తుతం 20 గేట్లు అడుగు మేర ఎత్తి 14,500 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నట్లు ఆయన తెలిపారు. శుక్రవారం ఉదయం వరద ఉదృతిని బట్టి గేట్లు ఎత్తుతామని, కృష్ణానది ఎగువ ప్రాంతంలో తట్లేరు, బుడమేరు, కీసర, చిన్న చిన్న వాగులు తదితర ప్రాంతాల నుండి వరద నీరు కృష్ణానదికి వచ్చి చేరుతుందని ఆయన తెలిపారు.


