అన్ని గ్రామాలకు ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

అన్ని గ్రామాలకు ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలి

Sep 25 2026 2:17 AM | Updated on Sep 25 2026 2:17 AM

అన్ని గ్రామాలకు ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలి

వైఎస్సార్‌ సీపీ పెదకూరపాడు నియోజకవర్గ సమన్వయకర్త నంబూరు శంకరరావు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌,, జిల్లా కలెక్టర్‌లకు వినతిపత్రాలు అందజేత

పెదకూరపాడు: అమరావతి మండలంలోని గ్రామ పంచాయతీలతోపాటు సీఆర్‌డీఏ పరిధిలో చేరిన గ్రామాలకు స్థానిక ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ పెదకూరపాడు నియోజకవర్గ సమన్వయకర్త నంబూరు శంకరరావు కోరారు. విజయవాడలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌ చంద్ర పునేఠా, నరసరావుపేటలో పల్నాడు జిల్లా కలెక్టర్‌ కృతికా శుక్లాలను ఆయన గురువారం కలిసి వినతిపత్రం అందజేశారు. అమరావతి మండలంలో మొత్తం 19 గ్రామ పంచాయతీలకుగాను ఇటీవలే వైకుంఠపురం, పెదమద్దూరు, చావపాడు, ఎండ్రాయి, లేమల్లె, కర్లపూడి గ్రామాలను సీఆర్‌డీఏ పరిధిలోకి తీసుకుని, ఆయా గ్రామాలలో భూసమీకరణ కార్యక్రమం ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల సంఘం రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో, అమరావతి మండలంలోని అన్ని గ్రామాలకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తారా..లేదా కొన్ని గ్రామాలకు మాత్రమే ఎన్నికలు నిర్వహిస్తారా? అనే అంశంపై ప్రజల్లో స్పష్టత లేదని దీనిపై వివిధ సామాజిక మాధ్యమాలలో చర్చ జరుగుతోందని తెలిపారు. గ్రామాల అభివృద్ధికి స్థానిక సంస్థలు ఎంతో కీలకమైనవని, ఎన్నికై న గ్రామసర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీల ద్వారా ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలను మరింత సమర్థంగా అమలు చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. గ్రామాలకు నిధులు అందుబాటులోకి వచ్చి అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం కావడానికి కూడా స్థానిక సంస్థలు అవసరమని అన్నారు. ఈ అంశాలను దృష్టిలో ఉంచికొని సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చిన గ్రామాలతో సహా అమరావతి మండలంలోని అన్ని గ్రామపంచాయతీలకు, సంబంధిత ఎంపీటీసీ మరియు జడ్పీటీసీ స్థానాలకు చట్టబద్ధమైన నిబంధనలు, ఎన్నికల నియమావళికి అనుగుణంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌, జిల్లా కలెక్టర్‌ సానుకూలంగా స్పందిస్తూ చట్టబద్ధంగా, ఎన్నికల నియమావళి అనుసరిస్తూ తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement