ఎగవేతకే ఐపీ టోపీ! | - | Sakshi
Sakshi News home page

ఎగవేతకే ఐపీ టోపీ!

Sep 20 2026 6:36 AM | Updated on Sep 20 2026 6:36 AM

ఆదివారం శ్రీ 20 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026 ఎగవేతకే ఐపీ టోపీ! కొరిటెపాడు (గుంటూరు): ఒకవైపు కోట్లాది రూపాయల విలువైన మిర్చి సరుకు.. మరోవైపు భారీ మొత్తంలో క్రెడిట్‌ లావాదేవీలు.. ఇంకోవైపు వరుసగా కొందరు ఎగుమతి వ్యాపారులు ఐపీకి వెళ్లడం.. ఇవన్నీ కలిపి దిగుమతి వ్యాపారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. గత రెండున్నరేళ్లలో రూ.100 కోట్లకుపైగా విలువైన బకాయిలకు సంబంధించి ఎగుమతి వ్యాపారులు ఐపీ దాఖలు చేసినట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ సంఖ్యకు సంబంధించి అధికారికంగా సమగ్ర గణాంకాలు వెల్లడికావాల్సి ఉంది. 14 రోజుల గడువు.. మిర్చి వ్యాపారంలో కోట్ల రూపాయల విలువైన సరుకు కేవలం బిడ్డింగ్‌, బిల్లు ఆధారంగా 14 రోజుల వరకు గడువుతో చేతులు మారుతున్నట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఈ 14 రోజులు చిన్న వ్యవధి కాదు.. ఈ సమయంలో సరుకు పలుమార్లు చేతులు మారే అవకాశం ఉంటుంది. ఒక వ్యాపారి నుంచి మరొకరికి.. అక్కడి నుంచి ఇంకో ఎగుమతిదారుడికి.. అక్కడి నుంచి ఇతర రాష్ట్రాలు, దేశాలకు.. ఇలా లావాదేవీలు కొనసాగుతాయి. వ్యాపారి ఐపీకి వెళ్లినప్పుడు అతని వద్ద ఉన్న ఆస్తులు, అప్పులు, ఇతర బాధ్యతలు వంటి అంశాలు చట్టపరమైన ప్రక్రియలోకి వెళ్తాయి. అప్పటికే సరుకు విక్రయించిన వ్యాపారులు తమ బకాయిల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. ఇక్కడే దిగుమతి వ్యాపారుల ఆందోళన పెరుగుతోంది. రైతుల సరుకును ఎగుమతి వ్యాపారులకు విక్రయించి, అదే రోజు లేదా మరో రెండు రోజుల్లో మొత్తం పట్టీ కట్టి రైతులకు దిగుమతి వ్యాపారులు చెల్లిస్తారు. ఎగుమతి వ్యాపారులు కొనుగోలు చేసిన సరుకుకు 14 రోజుల వరకు సమయం ఉంటుంది. ఎగుమతి వ్యాపారులు ఇటీవల వరుసగా ఐపీలు దాఖలు చేస్తుండటంతో కొంతమంది దిగుమతి వ్యాపారులు కూడా రైతులకు గడువు విధిస్తున్నట్లు సమాచారం. గత రెండున్నర సంవత్సరాల కాలంలో సుమారు రూ.100 కోట్లకుపైగా ఎగుమతి వ్యాపారులు ఐపీ దాఖలు చేసినట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. కోట్లాది రూపాయల విలువైన సరుకు కొనుగోలు చేసే వ్యాపారుల ఆర్థిక స్థితిగతులు, చెల్లింపుల సామర్థ్యం, గత బకాయిలు వంటి అంశాలపై ఏదైనా పర్యవేక్షణ వ్యవస్థ ఎక్కడన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. ఎగుమతి, దిగుమతి వ్యాపారుల ప్రయోజనాలను కాపాడేందుకు ఆయా సంఘాలు పనిచేస్తున్నాయి. వివాదాల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థ వంటి అంశాలపై చర్చ జరగాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. గుంటూరు మిర్చి యార్డులో ఎగుమతి, దిగుమతి లైసెన్స్‌లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. పలువురు రాజకీయ నాయకుల సిఫార్సులు, ఉన్నతాధికారుల ఆదేశాలతో వ్యాపారంలో ఎలాంటి అనుభవం లేని వ్యక్తులు కూడా లైసెన్స్‌లు పొందుతున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కీలకమైన ప్రభుత్వ సంస్థ మార్కెట్‌ కమిటీ కూడా పట్టించుకోవడం లేదు. ప్రతిభకు ప్రోత్సాహం ఈ అర్హతలు తప్పనిసరి

నష్టపోయేది చివరకు రైతేనా?

వ్యాపారుల మధ్య జరిగే ఆర్థిక లావాదేవీల సమస్య రైతుపై నేరుగా కనిపించకపోయినా.. దాని ప్రభావం పరోక్షంగా రైతుపై పడే అవకాశం ఉంది. వ్యాపారులకు నగదు కొరత ఏర్పడితే కొనుగోళ్ల సామర్థ్యం తగ్గుతుంది. కొనుగోలుదారులు జాగ్రత్తగా వ్యవహరిస్తారు. సరుకు కొనుగోలులో పోటీ తగ్గితే ధరలపై ప్రభావం పడే అవకాశం లేకపోలేదు. అదే సమయంలో వ్యాపారులు గత బకాయిలను పూడ్చుకునేందుకు కొనుగోళ్లలో వెనుకడుగు వేస్తే యార్డుకు వచ్చే రైతుల సరుకుపైనా ప్రభావం పడవచ్చు. అందుకే ఇది కేవలం వ్యాపారుల మధ్య బకాయిల సమస్య కాదని.. రైతు నుంచి ఎగుమతి వరకు ఉన్న మొత్తం మిర్చి వ్యాపార గొలుసుకు సంబంధించిన అంశమని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.

న్యూస్‌రీల్‌

మిర్చి సరుకుకు భద్రత కరువు

సాగర్‌ నీటిమట్టం

నిమ్మకాయల ధరలు

పశ్చిమ డెల్టాకు నీటి విడుదల

బాపట్ల
ఆదివారం శ్రీ 20 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026

14 రోజుల గడువుతో

రూ.కోట్ల వ్యాపారం

డబ్బులు రాకపోతే దిక్కేది?

వరుస ఐపీలతో

దిగుమతి వ్యాపారుల్లో గుబులు

అడ్డగోలుగా ఎగుమతి,

దిగుమతి లైసెన్స్‌లు

రెండున్నరేళ్లలో

రూ.వంద కోట్లకుపైగా ఐపీలు

చివరకు రైతుపైనా

ప్రభావం పడే ప్రమాదం

7

రైతులను తక్షణమే ఆదుకోవాలి

విజయపురి సౌత్‌: నాగార్జునసాగర్‌ జలాశయ నీటిమట్టం శనివారం 534.90 అడుగులకు చేరింది. ఇది 177.8698 టీఎంసీలకు సమానం.

తెనాలి: స్థానిక మార్కెట్‌ యార్డులో శనివారం క్వింటా నిమ్మకాయలు కనిష్ఠ ధర రూ.8 వేలు, గరిష్ఠ ధర రూ.11,300, మోడల్‌ ధర రూ.9,500 వరకు పలికింది.

దుగ్గిరాల: ప్రకాశం బ్యారేజ్‌ నుంచి పశ్చిమ డెల్టాకు శనివారం 3,506 క్యూసెక్కులు విడుదల చేసినట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు.

గుంటూరు మిర్చి యార్డులో కోట్లాది రూపాయల విలువైన మిర్చి సరుకు రోజూ చేతులు మారుతోంది. రైతులు తీసుకొచ్చిన సరుకును ఎగుమతి వ్యాపారులకు దిగుమతి వ్యాపారులు విక్రయించడం ద్వారా వ్యాపార లావాదేవీలు సాగుతున్నాయి. అయితే రూ.కోట్ల విలువైన సరుకు చేతులు మారుతున్నా.. దానికి తగిన ఆర్థిక భద్రత మాత్రం కనిపించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సరుకు తీసుకున్న ఎగుమతి వ్యాపారికి తర్వాత చెల్లింపులకు 14 రోజుల వరకు గడువు ఉండటం ఇప్పుడు వ్యాపార వర్గాల్లో ఆందోళనకు కారణమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement