లక్ష్మీపురం(గుంటూరువెస్ట్): గుంటూరు జిల్లాకు చెందిన కె.వరుణ్ చౌదరి ప్రతిష్టాత్మక క్రౌన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 2026 పోటీలో మిస్టర్ కేటగిరీలో విజేతగా నిలిచి టైటిల్‌ను కై వసం చేసుకున్నారు. విశాఖపట్నంలోని గదిరాజు ప్యాలెస్‌లో ఈనెల 12న జరిగిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని టాలీవుడ్ అసోసియేట్ డైరెక్టర్ సతీష్ అడ్డాల ఆధ్వర్యంలో నిర్వహించారు. సతీష్ అడ్డాల ఇప్పటికే 50కి పైగా షోలను నిర్వహించిన అనుభవంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ చాంబర్స్ సహకారం అందించింది. పోటీల్లో మొత్తం 200 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా, ప్రతిభ ఆధారంగా ప్రతి కేటగిరీలో 20 మంది చొప్పున ఎంపిక చేశారు. అనంతరం పోటీని మూడు ప్రధాన రౌండ్లుగా నిర్వహించారు. టాలెంట్ రౌండ్, వెస్ట్రన్ రౌండ్, ట్రెడిషనల్ రౌండ్‌లో కె.వరుణ్ చౌదరి తన ప్రతిభ, ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వంతో ప్రత్యేకంగా ఆకట్టుకున్నారు. మూడు రౌండ్లలోనూ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి, తుది ఫలితాల్లో క్రౌన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 2026 మిస్టర్ టైటిల్‌ను సొంతం చేసుకున్నారు.


