గుంటూరు మెడికల్: గుంటూరు జిల్లాలో బీఎస్సీ ఎంఎల్టీ అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు, భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) గుంటూరు జిల్లా కన్వీనింగ్ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ర్యాలీ గురువారం రెండో రోజుకు చేరుకుంది. గుంటూరు మెడికల్ కాలేజ్ నుంచి బీఆర్ స్టేడియం, టీడీపీ ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ అహ్మద్ కార్యాలయం వరకు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే నసీర్ అహ్మద్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. నాలుగేళ్లలో పూర్తికావాల్సిన బీఎస్సీ ఎంఎల్టీ అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సులు అనేక కారణాల వల్ల ఆరు సంవత్సరాలకు పొడిగించ బడుతున్నాయన్నారు. పరీక్షల నిర్వహణ, ఫలితాల విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో విద్యార్థులు తమ విద్యా సంవత్సరం కోల్పోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ గుంటూరు జిల్లా కన్వీనర్ షేక్ సమీర్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం, సంబంధిత విశ్వవిద్యాలయాలు, కళాశాల యాజమాన్యాలు చెలగాటం ఆడటం సరికాదన్నారు.
వీసీ హామీతో రిలే నిరాహార దీక్షలు విరమణ
మాచర్ల రూరల్ వేగంగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడిన సంఘటన మండలంలోని జమ్మలమడక గ్రామ సమీపంలో గురువారం జరిగింది. వివరాలలోకి వెళితే.. జమ్మలమడక గ్రామానికి చెందిన కూరాకుల చిన మల్లయ్య (53) మాచర్ల వెళ్తుండగా తుమృకోట గ్రామానికి చెందిన మద్దిపట్ల సైదయ్య మాచర్ల నుంచి తుమృకోటకు వెళ్తుండగా జమ్మలమడక గ్రామ సమీపంకు రాగానే రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ సంఘటనలో కూరాకుల చిన మల్లయ్య తలకు తీవ్ర గాయాలై సంఘటన స్థలంలో మృతిచెందాడు. చంద్రయ్యకు తలకు, కాళ్లకు తీవ్ర గాయాలు కాగా ఆయనను స్థానిక ప్రభుత్వాసుపత్రిలో ప్రథమ చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం కోసం గుంటూరుకు తరలించారు.


