గంగపుత్రులకు కష్టాలు | - | Sakshi
Sakshi News home page

గంగపుత్రులకు కష్టాలు

Sep 11 2026 9:40 AM | Updated on Sep 11 2026 9:40 AM

గంగపుత్రులకు కష్టాలు బాపట్ల: వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా ఈ ఏడాది వేట నిషేధం సమయం ముగిసినప్పటి నుంచి వేటకు వెళ్లినా కనీసం రోజుకు రూ.100 నుంచి రూ.150 కూడా రావడం లేదు. దీంతో సముద్రాన్నే నమ్ముకొని జీవనం సాగించే మత్స్యకారుల కుటుంబాల్లో చీకట్లు అలుముకున్నాయి. ఎన్నికల సమయంలో అవి చేస్తాం... అభివృద్ధికి రూ.వేల కోట్లు కేటాయిస్తామంటూ హామీలు ఇచ్చిన పాలకులు, ఎన్నికల తర్వాత కనీసం తమ మొర ఆలకించడం లేదని వారు వాపోతున్నారు. నిత్యం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందని పథకాలు అధికారంలోకి వస్తే మత్స్యకారులకు సబ్సిడీపై బోట్లు, వలలు ఇస్తామని చెప్పిన పాలకులు వాటి జోలికే పోలేదు. రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు బోట్లు, రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు వలలను 50 శాతం సబ్సిడీపై ఇప్పిస్తామని నాడు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు. ఇప్పుడు మత్స్యకారులు అప్పులు చేసి పాత బోట్లు, వలలకే మరమ్మతులు చేయించుకుంటున్నారు. వాటితోనే వేట సాగిస్తున్నారు. వీటిపై స్పందించాలని మత్స్యకార సంఘాల నుంచి ఎన్ని వినతిపత్రాలు ఇచ్చినప్పటికీ పాలకులు పట్టించుకోక బుట్టదాఖలు అవుతూనే ఉన్నాయి. జెట్టీ నిర్మాణం ఎక్కడ..? మత్స్యకారులు వేట అనంతరం బోట్లు నిలిపేందుకు ఏర్పాటు చేయాల్సిన జెట్టీ నిర్మాణంపై చంద్రబాబు ప్రభుత్వం మౌనంగా ఉండిపోయింది. జిల్లాలోని అన్ని ప్రాంతాలకు జెట్టి నిర్మాణానికి అడవిపల్లిపాలెం వద్ద అనువైన ప్రదేశంగా శాస్త్రవేత్తలు నిర్ణయించారు. ఈ మేరకు అప్పటి డెప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి జెట్టి నిర్మాణానికి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఆ విషయాన్ని కూటమి ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. నాడు ఎంతో మేలు

వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు మత్స్యకారుల సంక్షేమం మూడు పువ్వులు.. ఆరు కాయల్లా సాగింది. బాపట్ల జిల్లాలో 40 గ్రామాల వరకు మత్స్యకారులు, 12 వేల కుటుంబాల వరకు ఉన్నారు. అప్పటి వరకు వేట నిషేధం సమయంలో ఇచ్చే భత్యం రూ.4 వేలు ఉండగా, కేవలం 5 వేల మంది వరకు మాత్రమే ఇచ్చేవారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఈ భత్యాన్ని ఒక్కసారిగా రూ.10 వేలకు పెంచారు. అర్హతే ఆధారంగా సచివాలయాల నుంచి నేరుగా అర్హుల జాబితా తయారు చేసి జిల్లాలో 11,800 మందికి వేట నిషేధం సమయంలో ఇచ్చే భత్యాన్ని అందించారు. తాజాగా చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు భత్యం ఇవ్వలేదు. ఇటీవల భత్యాన్ని అరకొరగా విడుదల చేశారు. వైఎస్సార్‌సీపీ హయాంలో మత్స్యకారులకు వేట సమయంలో ఉపయోగించే డీజిల్‌పై 2 శాతం రాయితీ ఉండగా, దానిని 6 శాతానికి పెంచారు. కూటమి అధికారంలోకి వస్తే ఈ సబ్సిడీని 12 శాతానికి పెంచుతామని ఇచ్చిన హామీ నేటికీ అమలుకు నోచుకోలేదు.

నాడు సంక్షేమం... నేడు సంక్షోభం

పలు హామీలు నెరవేర్చని

చంద్రబాబు సర్కార్‌

సబ్సిడీపై బోట్లు.. వలలు

ఇస్తామని దగా

వేట నిషేధం సమయంలో

దిక్కులేని సాయం

గంగపుత్రుల కష్టాలు వినేవారే కరువయ్యారు. తీరంలో ఎగిసిపడే కెరటాలకు ఎదురొడ్డి జీవనం సాగించే మత్స్యకారులకు రోజంతా పనిచేసినా పూట గడవని దుర్భర పరిస్థితి నెలకొంది. వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు అడిగిందే తడవుగా వరాల జల్లు కురిపించగా, నేడు ఆదుకునేవారే లేరు. రోజంతా వేట సాగించినప్పటికీ ఇల్లు గడవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం హామీలు ఇచ్చి అమలు మరిచిపోయిందని వాపోతున్నారు. అడగాలంటే వేట నిషేధం సమయంలో ఇచ్చే భత్యం ఎక్కడ నిలిచిపోతుందోననే భయంతో మౌనంగా ఉండిపోతున్నారు. కనీసం పక్కా గృహాలు కూడా లేక గుడిసెల్లోనే మగ్గిపోతున్నారు. ఇకనైనా పాలకులు తమ సమస్యలు తీర్చాలని వేడుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement