దరఖాస్తుకే దడదడ | - | Sakshi
Sakshi News home page

దరఖాస్తుకే దడదడ

Sep 10 2026 1:45 AM | Updated on Sep 10 2026 1:45 AM

గురువారం శ్రీ 10 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026 దరఖాస్తుకే దడదడ సాగర్‌ నీటిమట్టం

న్యూస్‌రీల్‌

పింఛను రఖాస్తుదారుల్లో టెన్షన్‌ కొత్త పింఛన్లకు అలవికాని ఆంక్షలు అర్హత ఉన్నా... తప్పని తిప్పలు ఏడురోజులే గడువు... మధ్యలో మూడు సెలవులు మొరాయిస్తున్న సర్వర్లు సచివాలయాల వద్ద పడిగాపులు

బాపట్ల
గురువారం శ్రీ 10 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026

విజయపురిసౌత్‌: నాగార్జునసాగర్‌ జలాశయ నీటిమట్టం బుధవారం 534.90 అడుగులకు చేరింది. ఇది 177.8698 టీఎంసీలకు సమానం.

బాపట్ల టౌన్‌: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతోంది. మొన్నటివరకు కొత్త పింఛన్ల ఊసేలేదు. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండటంతో హడావుడిగా ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. దరఖాస్తులకు సవాలక్ష ఆంక్షలు విధించారు. తక్కువ గడువు ఇచ్చి, వాటిని అప్‌లోడ్‌ చేయడానికి సర్టిఫికెట్లను ముడిపెట్టారు. కొందరు అన్ని పత్రాలు తీసుకొని సచివాలయానికి వెళితే సర్వర్లు పనిచేయడం లేదు. కొన్ని ప్రాంతాల్లో సచివాలయ ఉద్యోగులు, దరఖాస్తుదారుల మధ్య ఘర్షణలు తలెత్తుతున్నాయి. ఇలా కార్యాలయాల చుట్టూ తిప్పడమేంటంటూ వృద్ధులు, దివ్యాంగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గంటల తరబడి అవస్థలు

కొత్త పింఛన్‌ దరఖాస్తుకు ఈ నెల 16వ తేదీని గడువుగా నిర్ణయించారు. ఇందులోనే శని, ఆది, సోమవారాలు వరుస సెలవులు ఉన్నాయి. మిగిలిన అతికొద్ది రోజుల్లోనైనా దరఖాస్తు చేసుకుందామంటే సచివాలయాల్లో సర్వర్లు పూర్తిగా మొరాయిస్తున్నాయి.

బుధవారం ఉదయాన్నే సచివాలయాల వద్దకు చేరుకున్న వృద్ధులు, దివ్యాంగులు గంటల తరబడి నిరీక్షించారు. ఆన్‌లైన్‌ ప్రక్రియపై అవగాహన లేని వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత కార్మికులు, దీర్ఘకాలిక రోగులు వేరే సహాయకులను తోడుగా తెచ్చుకుంటున్నారు. అందరూ గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. దరఖాస్తు ప్రక్రియలో ఓటరుకార్డుకు మొబైల్‌ నంబర్‌ అనుసంధానం, ఓటీపీ వంటి ప్రక్రియలు దరఖాస్తుదారులకు మరో సమస్యగా మారాయి. మొబైల్‌ నంబర్‌ అనుసంధానం లేకపోవడం, ఓటీపీ ఆలస్యంగా రావడం, అసలు రాకపోవడంతో పలువురు దరఖాస్తుదారులు ప్రక్రియను పూర్తిచేయలేకపోయారు. చిన్న సాంకేతిక సమస్యలకే గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుందని దరఖాస్తుదారులు వాపోతున్నారు.

ఎన్నికల కోసమే ఈ తతంగం

ఎన్నికల హామీలో భాగంగా సూపర్‌ సిక్స్‌లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్‌ ఇస్తామంటూ ఎన్నికల సమయంలో ఊదరగొట్టిన చంద్రబాబు అధికారంలోకి వచ్చి 27 నెలలు అవుతున్నా ఇప్పటివరకు ఒక్క కొత్త పింఛన్‌ ఇచ్చిన దాఖలాలు లేవు. స్థానిక సంస్థల ఎన్నికలు తరుముకొస్తుండటంతో కనీసం దరఖాస్తులనైనా స్వీకరించకపోతే గట్టెక్కే పరిస్థితులు ఉండవని భావించి హడావుడిగా ఈ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతిసారీ పింఛన్ల పెత్తనం జన్మభూమి కమిటీల చేతుల్లో ఉండేది. అర్హులకు పింఛన్‌ అందాలంటే జన్మభూమి కమిటీలోని సభ్యులను ప్రసన్నం చేసుకుంటేనే సాధ్యమయ్యేది. ఇప్పుడైనా పారదర్శకంగా అందజేస్తారో... లేదో వేచి చూడాలి.

వైఎస్సార్‌ సీపీ హయాంలో ఇలా...

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అర్హతే ప్రామాణికంగా ప్రతి ఒక్కరికీ రాజకీయాలు, కులమతాలకు అతీతంగా పింఛన్లు అందజేశారు. అప్పట్లో క్షేత్రస్థాయిలో వలంటీర్లు దరఖాస్తులు సేకరించి సచివాలయంలో అందజేయడం, సచివాలయ సిబ్బంది ఆన్‌లైన్‌ చేయడంవంటివి చకచకా జరిగిపోయేవి. అర్హులకు పింఛన్లు మంజూరయ్యేవి. ప్రతి ఏడాది జనవరి, జూలై మాసాల్లో అర్హులైన ప్రతి ఒక్కరికీ కొత్త పింఛన్లు అందించేవారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement