నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు కమీషన్లకు బలి అవుతున్నాయి. భారీ నిధులు మంజూరు అవుతున్నప్పటికీ, పనుల నాణ్యత మాత్రం పూర్తిగా డొల్లతనంగా ఉంటోంది. కేవలం పది నెలల క్రితం రూ.9.70 కోట్ల వ్యయంతో ఇసుకపల్లి నుంచి నిజాంపట్నం వరకు నిర్మించిన రహదారి పూర్తిగా నాసిరకంగా మారింది. నెలలు గడవకముందే గుంతలమయం కావడం పనుల దారుణ పరిస్థితికి నిదర్శనం. ప్రజలకు ఉపశమనం కలిగించాల్సిన రహదారులు ఇబ్బందులకు కారణమవుతున్నాయి. నియోజకవర్గంలో చేపడుతున్న ప్రతి అభివృద్ధి పనిలో మంత్రి సత్యప్రసాద్, ఆయన సోదరుడు శివప్రసాద్ భారీగా కమీషన్లు వసూలు చేస్తున్నారు. ఈ అవినీతి కారణంగానే పనులు నాణ్యత కోల్పోతున్నాయి. దీంతో ప్రజాధనం వృథా అవుతోంది. ఈ వ్యవహారంపై జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి
– పీటా నాగమోహన్‌కృష్ణ, వైఎస్సార్‌సీపీ రేపల్లె సమన్వయకర్త


