కాంట్రాక్టు ఉద్యోగులపై కనికరం చూపండి | - | Sakshi
Sakshi News home page

కాంట్రాక్టు ఉద్యోగులపై కనికరం చూపండి

Sep 9 2026 3:28 AM | Updated on Sep 9 2026 3:28 AM

బాపట్లటౌన్‌ : ప్రభుత్వం ఆరోగ్యశాఖ కాంట్రాక్టు ఉద్యోగులపై కనికరం చూపాలని జిల్లా వైద్యఆరోగ్యశాఖ కాంట్రాక్ట్‌ ఉద్యోగుల జేఏసీ సభ్యులు కూరపాటి సత్యంరాజు తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్‌లను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం బాపట్ల ఏరియావైద్యశాల ప్రాంగణంలోని అమరజీవి పొట్టిశ్రీరాములు విగ్రహం ముందు నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకొని మోకాళ్లపై నిరసన తెలిపారు. సత్యంరాజు మాట్లాడుతూ రాష్ట్ర జేఏసీ సంఘంతో ప్రభుత్వం చర్చలు జరిపి నెల రోజుల సమయం ఇవ్వాలని కోరగా ప్రధాన డిమాండ్లు రెగ్యులరైజేషన్‌, రెగ్యులర్‌ అయ్యేంతవరకు 100 శాతం గ్రాస్‌ జీతాన్ని పొందెంతవరకు తమ నిరసనలు కొనసాగుతాయన్నారు. కార్యక్రమంలో స్టాఫ్‌నర్స్‌లు అనూష, తబిత, ఫార్మాసిస్ట్‌లు నళిని, శాంతి మనోజ, ల్యాబ్‌ టెక్నీషియన్‌లు నీలిమ, సునీత, బయో మెడికల్‌ ఇంజినీర్‌ నళిని కుమారి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement