విద్యుత్‌ బస్‌లను ఆర్టీసీ పర్యవేక్షించాలి | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ బస్‌లను ఆర్టీసీ పర్యవేక్షించాలి

Sep 9 2026 3:28 AM | Updated on Sep 9 2026 3:28 AM

విద్యుత్‌ బస్‌లను ఆర్టీసీ పర్యవేక్షించాలి 26న వాహనాల వేలం గంజాయి విక్రేతపై పీఐటీ–ఎన్‌డీపీఎస్‌ చట్టం నమోదు

నగరంపాలెం: ఆర్టీసీలోకి ప్రవేశపెట్టే విద్యుత్‌ బస్‌లను ఆర్టీసీ ద్వారానే నడపాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బి.లక్ష్మణరావు డిమాండ్‌ చేశారు. స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు మంగళవారం ఆర్‌టీసీ బస్టాండ్‌ ఆవరణలో నిరాహార దీక్ష శిబిరాన్ని ప్రారంభించారు. లక్ష్మణరావు మాట్లాడుతూ విద్యుత్‌ బస్‌ల డిపోల ఏర్పాటు పేరుతో మూసివేసిన అలిపిరి, శ్రీపొట్టిశ్రీరాముల నెల్లూరు– 2, గుంటూరు– 2, విద్యాధరపురం డిపోలను పునఃప్రారంభించాలని కోరారు. పెరుగుతున్న మహిళల ఉచిత ప్రయాణికుల దృష్ట్యా బస్‌లు, సిబ్బందిని పెంపొందించకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్‌ బస్‌ల పేరుతో ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం సరికాదన్నారు. మూతపడిన డిపోలను వెంటనే పునః ప్రారంభించాలని అన్నారు. శిబిరంలో ఏఐటీయూసీ, సీఐటీయూ జిల్లా నాయకులు ఎం.హనుమంతరావు, ముత్యాలరావు, చింతల శ్రీనివాసరావు, ఆర్టీసీ రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌ రాష్ట్ర నాయకులు కె.గంగాధర్‌రావు, జె.నాంచారయ్య, కె.పాములు మద్దతు ప్రకటించగా, ఫెడరేషన్‌ జిల్లా సహాయ కార్యదర్శి ఎంవీఎస్‌.రామకృష్ణ, కార్యకర్తలు వి.మధుసూదన్‌రావు, సిహెచ్‌.శ్రీను, టి.శ్రీను, రవిచంద్‌, జయశ్రీ, బి.రామాంజనేయులు, ఎల్‌.వి.ఆర్‌ రాజు తదితరులు పాల్గొన్నారు.

నగరంపాలెం: పన్నులు చెల్లించకుండా రవాణాశాఖ అధికారుల తనిఖీల్లో పట్టుబడి, నిర్బంధంలో ఉన్న వాహనాలు ఈనెల 26 వేలం నిర్వహించనున్నట్లు గుంటూరు ఉపరవాణా కమిషనర్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరు ఉప రవాణా కమిషనరు కార్యాలయ ఆవరణలోని 33, తెనాలి కార్యాలయంలోని 33 వాహనాలు (హెచ్‌జీవీలు, ఎంజీవీలు, ఎల్‌జీవీలు, మోటార్‌ సైకిల్స్‌, మోటార్కార్‌, మ్యాక్సిక్యాబ్‌లు) ఈ వేలంలో విక్రయిస్తామని తెలిపారు. సంబంధిత వాహనాల యజమానులు, ఫైనాన్షియర్లు చెల్లించాల్సిన పన్నులు, అపరాధ రుసుం ఈనెల 25లోగా చెల్లించాలని అన్నారు. లేనిచో ఈనెల 26 మధ్యాహ్నం రెండు గంటలకు గుంటూరు డీటీఓ కార్యాలయంలో వేలం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

నగరంపాలెం: గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు చేస్తూ, అలవాటైన నేరస్తుడిపై పీఐటీ–ఎన్‌డీపీఎస్‌ చట్టం ప్రయోగించి రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలుకి తరలించారు. ఈ మేరకు మంగళవారం జిల్లా పోలీస్‌ కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. దుగ్గిరాల, తెనాలి, మంగళగిరి ప్రాంతాల్లో యువత, విద్యార్థులు లక్ష్యంగా గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు చేస్తూ, అలవాటైన తాడేపల్లి మండలం గుండిమెడ గ్రామానికి చెందిన 25 ఏళ్ల మల్లవరుపు పృధ్వీపై ప్రభుత్వం నిర్బంధ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం గుంటూరు జిల్లా జైల్లో ఉన్న పృధ్వీని రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలుకు పోలీసులు తరలించారు. అతనిపై మంగళగిరి పట్టణ పీఎస్‌, తాడేపల్లి పీఎస్‌, దుగ్గిరాల పీఎస్‌, ఎన్‌టీఆర్‌ జిల్లా సూర్యారావుపేట పీఎస్‌, గుడూరు పీఎస్‌లో కేసులు ఉన్నాయని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement