క్రీడాకారులకు కలెక్టర్‌ అభినందనలు | - | Sakshi
Sakshi News home page

క్రీడాకారులకు కలెక్టర్‌ అభినందనలు

Sep 9 2026 3:28 AM | Updated on Sep 9 2026 3:28 AM

బాపట్ల: అమరావతి చాంపియనన్‌ షిప్‌–2026 పోటీలలో బాపట్ల జిల్లా క్రీడాకారులు పలు విభాగాల్లో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించారని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌ తెలిపారు. గత నెల 24 నుంచి 29వ తేదీ వరకు తిరుపతిలో జరిగిన చాంపియన్‌షిప్‌ పోటీలలో పలు విభాగాల్లో జిల్లా క్రీడాకారులు ప్రథమ, ద్వితీయ స్థానాలను సాధించారు. పతకాలు సాధించిన క్రీడాకారులను జిల్లా కలెక్టర్‌ మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లో అభినందించారు. క్రీడాకారులు తమ నైపుణ్యాలను పెంపొందించుకుంటూ అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించాలని కలెక్టర్‌ ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి శ్రీనివాస్‌, కోచ్‌లు, రాధాకృష్ణ, వెంకట్‌, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.

క్రీడాకారులను అభినందిస్తున్న జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement