టీడీపీ మాజీ నాయకుడు బాటకోటిరెడ్డి అరెస్టు | - | Sakshi
Sakshi News home page

టీడీపీ మాజీ నాయకుడు బాటకోటిరెడ్డి అరెస్టు

Aug 24 2026 7:03 AM | Updated on Aug 24 2026 7:03 AM

టీడీపీ మాజీ నాయకుడు బాటకోటిరెడ్డి అరెస్టు నిరుద్యోగుల సమస్యలపై నిరంతర పోరాటం

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలింపు

చుండూరు(వేమూరు): ీసఐని కులం పేరుతో ధూషించిన కేసులో టీడీపీ మాజీ నాయకుడు కుదేటి బాల కోటిరెడ్డిని శనివారం రాత్రి అరెస్ట్‌ చేసి తెనాలి కోర్టులో హాజరుపర్చినట్లు ఎస్‌ఐ అనిల్‌కుమార్‌ తెలిపారు. చుండూరు గ్రామానికి చెందిన కుదేటి బాలకోటిరెడ్డి, మరి కొందరు ఈ నెల 3వ తేదీ అర్థరాత్రి చుండూరు పోలీసుస్టేషన్‌పై దాడి చేసి దళిత సామాజిక వర్గానికి చెందిన చుండూరు సీఐ ఆనందరావును కులంతో ఇష్టారాజ్యంగా ధూషించినట్లు ఎస్‌ఐ తెలిపారు. బాల కోటిరెడ్డి, మరి కొందరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసీటి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అప్పటి నుంచి బాలకోటిరెడ్డి పరారీలో ఉన్నాడు. ఎస్‌ఐ నాగేశ్వరరావు, మరికొందరు కానిస్టేబుళ్లు బృందంగా ఏర్పడి రంగారెడ్డి జిల్లాలో శనివారం రాత్రి అరెస్ట్‌ చేసి చుండూరు పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చారు. బాల కోటిరెడ్డి, ఉదయ్‌కుమార్‌ రెడ్డి, గుణపవన్‌, ఎలిషాలను తెనాలి రెండవ అదనపు జడ్జి ముందు హాజరు పర్చారు. బాల కోటిరెడ్డిని రిమాండ్‌పై నెల్లూరు సబ్‌ జైలుకి, ఉదయ్‌కుమార్‌ రెడ్డి, గుణ పవన్‌, ఎలిషాలను రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు. బాల కోటిరెడ్డిని ఇటీవల టీడీపీ నుంచి సస్పెండ్‌ చేసిన విషయం విదితమే.

డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న

బాపట్ల: రాష్ట్రంలో నిరుద్యోగులు, యువకుల సమస్యలు ప్రభుత్వానికి పట్టడం లేదని డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న విమర్శించారు. పుచ్చలపల్లి సుందరయ్య ప్రజాసంఘాల జిల్లా కార్యాలయంలో డీవైఎఫ్‌ఐ జిల్లా విస్త్తృతస్థాయి సమావేశం ఆదివారం నిర్వహించారు. కేవీ లక్ష్మణరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రామన్న మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన జాబ్‌ క్యాలెండర్‌ కంటితుడుపు మాత్రమేనన్నారు. కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు రూ.3000 భృతి ఇస్తామన్న హామీ అమలు చేయలేదని విమర్శించారు. రాష్ట్రంలోని వివిధ శాఖల్లో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే జాబ్‌ క్యాలెండర్‌లో కేవలం 10,060 పోస్టులు భర్తీ చేయడం ఎమీటని ప్రశ్నించారు. ఒక్క పోలీస్‌ శాఖలోనే 19,996 పోస్టులు ఖాళీలు ఉంటే 2265 మాత్రమే భర్తీ చేయడం అన్యాయమన్నారు. మరో డీఎస్సీ అని మంత్రి లోకేష్‌ ప్రకటించారని, అందులో ఎన్ని పోస్టులు ఉంటాయో ప్రకటించకపోవడం మరో మోసమే అన్నారు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడవద్దని అన్నారు. తక్షణమే జాబ్‌ క్యాలెండర్‌ను సవరించి పోస్టుల సంఖ్య పెంచాలని డిమాండ్‌ చేశారు. సెప్టెంబర్‌ 1,2,3 తేదీల్లో నెల్లూరులో జరిగే డీవైఎఫ్‌ఐ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యవర్గం ఎన్నిక

డీవైఎఫ్‌ఐ నూతన జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నికున్నారు. కార్యదర్శిగా సీహెచ్‌.ప్రకాష్‌, అధ్యక్షుడిగా జి.యేసుబాబు, కోశాధికారి కేవీ.లక్ష్మణరావు, ఉపాధ్యక్షుడుగా వి.సుధీర్‌, సహాయకార్యదర్శిగా డి.దినేష్‌ ఎన్నికయ్యారు. సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ మాజీ నాయకులు సిహెచ్‌.మణిలాల్‌, ఎం.కిరణ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement