విశ్రాంత పోలీస్‌ అధికారుల సంక్షేమమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

విశ్రాంత పోలీస్‌ అధికారుల సంక్షేమమే లక్ష్యం

Aug 23 2026 1:28 AM | Updated on Aug 23 2026 1:28 AM

విశ్రాంత పోలీస్‌ అధికారుల సంక్షేమమే లక్ష్యం

విశ్రాంత డీజీపీ ఎం.మాలకొండయ్య ఆరో బెటాలియన్‌లో సంఘం కార్యాలయానికి భవనం కేటాయించాలి

నగరంపాలెం: మంగళగిరి ఆరో బెటాలియన్‌లో ఏపీ రిటైర్డ్‌ పోలీస్‌ అధికారుల సంఘం కార్యాలయానికి భవనం కేటాయించాలని డీజీపీని కోరనున్నట్లు సంఘం అధ్యక్షుడు, విశ్రాంత డీజీపీ ఎం.మాలకొండయ్య తెలిపారు. శనివారం గుంటూరు లక్ష్మీపురం ప్రధాన రహదారిలోని ఏపీ కాటన్‌ అసోసియేషన్‌ సమావేశ మందిరం హాల్‌లో ఏపీ రిటైర్డ్‌ పోలీస్‌ అధికారుల సంఘం కార్యవర్గ సమావేశం నిర్వహించారు. సమావేశంలో సంఘం బలోపేతం, రిటైర్డ్‌ పోలీస్‌ అధికా రుల సంక్షేమం, పెండింగ్‌ రీయింబర్స్‌మెంట్‌ బిల్లులు, రాష్ట్ర సంఘ కార్యాలయానికి స్థలం కేటాయింపు అంశాలపై చర్చించారు. అధ్యక్షత వహించిన మాలకొండయ్య మాట్లాడుతూ ప్రతి పోలీస్‌స్టేషన్‌లో రిటైర్డ్‌ పోలీస్‌ అధికారుల వివరాలతో ప్రత్యేక రిజిస్ట్రర్లు నిర్వహించాలని అన్నారు. న్యాయమై న సమస్యలు పరిష్కరించేందుకు అవసరమైన సహకారం అందించేందుకు సీపీలు, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేయాలని డీజీపీ ని కోరనున్నట్లు తెలిపారు. సంఘం సాధించిన విజయాలు, సంక్షేమ కార్యక్రమాలపై నివేదికను సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విశ్రాంత ఏఎస్పీ కె.సత్యనారాయణ వివరించారు. జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ మాట్లాడుతూ రిటైర్డ్‌ పోలీస్‌ అధికారుల న్యాయమైన సమస్యల పరిష్కారానికి సహకారం అందిస్తాన ని తెలిపారు. అనంతరం ఎస్పీని సన్మానించారు. సంఘం సీనియర్‌ కార్యవర్గ సభ్యులు పీవీఎస్‌ రామకృష్ణ, ఎ.రవిచంద్ర, కె.లక్ష్మణ్‌మోహన్‌, కె.సత్యనారాయణ, కేవీ.నారాయణ, ఎంఎస్‌.ప్రసాద్‌, ఏఎస్‌ఎన్‌.రెడ్డి, జి.నారాయణస్వామి, ఎల్‌.ప్రభాకర్‌రావు, విశ్రాంత పోలీస్‌ ఉన్నతాధికారులు, పలు యూనిట్ల అధ్యక్షులు, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

నూతన కార్యవర్గం ఏకగ్రీవం

ఏపీ రిటైర్డ్‌ పోలీస్‌ అధికారుల సంఘం గుంటూరు జిల్లా యూనిట్‌ కార్యవర్గం ఏకగ్రీవమైంది. అధ్యక్షుడిగా విశ్రాంత డీఎస్పీ వి.పోతురాజు, ఉపాధ్యక్షులుగా విశ్రాంత డీఎస్పీ పీవీ సుబ్బారెడ్డి, కార్యదర్శిగా విశ్రాంత ఎిస్పీ మేక రమేష్‌బాబు, సంయుక్త కార్యదర్శిగా విశ్రాంత డీఎస్పీ బీరం నాగేశ్వరరావు, కోశాధికారిగా విశ్రాంత ఏఎస్పీ ఎండీ.మహబూబ్‌బాషా, కార్యవర్గ సభ్యులుగా విశ్రాంత డీఎస్పీ ఎం.జయప్రసాద్‌, విశ్రాంత ఏఎస్పీ నెట్టం ప్రసాద్‌ ఎన్నికయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement