జూడాల వినూత్న నిరసన | - | Sakshi
Sakshi News home page

జూడాల వినూత్న నిరసన

Aug 23 2026 1:28 AM | Updated on Aug 23 2026 1:28 AM

13వ రోజుకు చేరిన సమ్మె

గుంటూరు మెడికల్‌: ఆంధ్రప్రదేశ్‌ జూనియర్స్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు గుంటూరు జీజీహెచ్‌లో జూనియర్‌ డాక్టర్లు చేస్తున్న సమ్మె శనివారానికి 13వ రోజుకు చేరుకుంది. సూపరింటెండెంట్‌ కార్యాలయం ఎదుట జూడాలు బైఠాయించి తమ న్యాయబద్ధమైన డిమాండ్‌లను ప్రభుత్వం నెరవేర్చాలంటూ నినాదాలు చేశారు. కొంత మంది జూనియర్‌ డాక్టర్లు రిలే నిరాహార దీక్షలు చేశారు. తమకు ప్రభుత్వం ఇస్తామన్న మూడు శాతం స్టయిఫండ్‌ వద్దంటూ రెండు చేతులు పైకెత్తి వినూత్నరీతిలో నిరసన తెలియజేశారు. జూడాల సమ్మెకు ఏపీఎంఎస్‌ఆర్‌యూ, ఎఫ్‌ఎంఏఆర్‌ఐ ప్రతినిధులు మద్దతు తెలిపారు. జూడాల సమ్మైపె ప్రజలు ఏవిధంగా స్పందిస్తున్నారనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్‌లు నెరవేర్చే వరకు సమ్మె కొనసాగిస్తామని యూనియన్‌ నేతలు స్పష్టం చేశారు. సమ్మెలో గుంటూరు మెడికల్‌ కాలేజ్‌ జూనియర్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు యు.ఈశ్వర్‌శంకర్‌, వైస్‌ ప్రెసిడెంట్స్‌ ఎ.వి.కృష్ణచౌదరి, కె.ప్రసన్న ఆదిలక్ష్మి, షేక్‌ సోహిల్‌ అలీ, జనరల్‌ సెక్రటరీలు విఘ్నేష్‌ ఆపతి, జగదీష్‌ గాదె, పి.ఎస్‌.వి.కల్యాణి, కోశాధికారులు జేత్ర మర్రిపాటి, అనురాగ్‌, జాయింట్‌ సెక్రటరీలు బి.వంశీకష్ణ, బి.స్నేహసాహిత్య, జి.రాధిక, కునపవర్‌ కార్తిక, నిషిరాగ్‌ బికుంతె, పి.సందీప్‌కుమార్‌, ఎగ్జిక్యూటీవ్‌ సభ్యులు ఎన్‌.సాయిప్రదీప్‌, ఉదయ్‌సాగర్‌, సాయిప్రదీప్‌, తరుణ్‌కుమార్‌, హేమంత్‌నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement