న్యూస్‌రీల్
ప్రస్తుత ఖరీఫ్ సీజనులో వరిసాగు చేయొద్దు కృష్ణా పశ్చిమ డెల్టా ప్రాజెక్టు కమిటీ సూచన తాగునీటికే ప్రథమ ప్రాధాన్యమని వెల్లడి ప్రత్యామ్నాయ ప్రణాళికలపై తొలినుంచీ చంద్రబాబు సర్కారు ఉదాసీనత
తాగునీటి అవసరాలు ముఖ్యం
గురువారం శ్రీ 30 శ్రీ జూలై శ్రీ 2026
విజయపురి సౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం బుధవారం 513.10 అడుగులకు చేరింది. సాగర్ నుంచి ఎస్‌ఎల్‌బీసీకి 450 క్యూసెక్కులు విడుదలవుతోంది.
తెనాలి: ఈ ఏడాది వర్షాకాలం ఆశించినంతగా అనుకూలించకపోవడంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సాగునీటి లభ్యతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో జలాశయాల్లో నీటి నిల్వలు గణనీయంగా తగ్గిపోవడం, ఎగువ ప్రాంతాల నుంచి ఆశించిన మేర ప్రవాహాలు లేకపోవడం వల్ల సాగునీటి నిర్వహణ సవాల్‌గా మారింది. ఈ పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న నీటిని తాగునీటి అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ, మిగిలిన నీటిని అత్యంత పొదుపుగా వినియోగించాల్సిన అవసరం ఏర్పడింది. రైతులు కూడా ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పంటల ఎంపికలో జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
ఆరుతడి పంటలు మేలు
సూపర్ ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు, రిజర్వాయర్లలో నీటిలభ్యత లేని ప్రస్తుత అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కృష్ణా డెల్టా రైతులు ప్రస్తుత ఖరీఫ్ సీజనులో వరిసాగు చేయొద్దని కృష్ణా పశ్చిమ డెల్టా ప్రాజెక్టు కమిటీ సూచించింది. అవకాశం ఉన్నచోట ఆరుతడి పంటలకు మాత్రమే వెళ్లాలని పేర్కొంది. తెనాలిలోని పశ్చిమ డెల్టా డివిజన్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం కమిటీ సమావేశం జరిగింది. కమిటీ వైస్ చైర్మన్ నువ్వుల సునీల్‌చౌదరి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జలవనరుల శాఖ సూపరింటెండెంట్ ఇంజినీరు (ఎస్‌ఈ) పులిపాటి వెంకటరత్నం మాట్లాడుతూ కృష్ణానదిపై గల శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు కనిష్ఠ స్థాయిలో ఉన్నాయని గుర్తుచేశారు. ఎగువ ప్రాజెక్టులైన ఆల్మటి, నారాయణపూర్, జూరాలలో ఇంకా 50 టీఎంసీల మేర ఖాళీ ఉందన్నారు. పులిచింతలలో 29 టీఎంసీలు ఉన్నప్పటికీ 2027 జూన్ వరకు తాగునీటి అవసరాల కోసం ఆ నీటిని నిల్వ చేసుకోవడం తప్పనిసరి అని తెలిపారు. కృష్ణా డెల్టాకు పోలవరం కుడి కాలువ ద్వారా నీటిని విడుదల చేస్తున్నప్పటికీ గోదావరిలోనూ నీటి ప్రవాహం తగ్గిందన్నారు. పట్టిసీమకు గల 24 పంపుల నుంచి పూర్తిస్థాయిలో నీటిని అందించలేని పరిస్థితి నెలకొందని తెలిపారు. గోదావరి జలాలు మరో 60–70 రోజులు మాత్రమే అందుబాటులో ఉండే అవకాశమున్నందున తొలి ప్రాధాన్యత గోదావరి ఆయకట్టుకు నీరివ్వాల్సి ఉంటుందని వెంకటరత్నం చెప్పారు.
ఎల్‌నినోను సమర్థంగా ఎదుర్కొందాం
ఏపీఎంఐపీ ఓఎస్డీ రవికుమార్
మరో నలుగురికి గాయాలు
ప్రస్తుతం కృష్ణాడెల్టాకు వదులుతున్న నీటిని ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లోని 60 లక్షల మందికిపైగా ప్రజల తాగునీటి అవసరాల కోసం చెరువులను నింపేందుకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. పోలవరం కుడికాలువ పరిధిలోని కొన్నిచోట్ల రైతులు అనధికార పంపులతో నీటిని తరలిస్తుండటంతో కృష్ణా డెల్టాకు చేరాల్సిన నీటి ప్రవాహం తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో నీటి ప్రాజెక్టులకు సమృద్ధిగా నీరు వస్తే ఖరీఫ్‌పై ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లేందుకు వ్యవసాయ, జలవనరుల శాఖలు కలిసి పనిచేస్తాయని చెప్పారు. ప్రస్తుతమున్న అత్యవసర పరిస్థితిని రైతులు అర్థం చేసుకుని సహకరించాలని కోరారు. కాగా, వర్షాభావ పరిస్థితులపై రైతులను ముందస్తుగా అప్రమత్తం చేయడంలో చంద్రబాబు సర్కారు తొలి నుంచి నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తోందనే విమర్శలు ఉన్నాయి. ఈ విషయంలో రైతులను అప్రమత్తం చేయడంతోపాటు ప్రత్యామ్నాయ పంట ప్రణాళికల రూపకల్పన, అమలు విషయంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యహరించడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


