బాపట్ల: రైతులు వ్యవసాయంలో ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని అధిక దిగుబడులు సాధించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ తెలిపారు. వ్యవసాయ రంగంలో ఆధునిక మార్పులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందించాలన్న లక్ష్యంతో జిల్లా వ్యవసాయ శాఖ, ఆత్మ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కిసాన్ మేళాలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పలు శాఖలు ఏర్పాటు ప్రదర్శన స్టాళ్లను తిలకించారు. పంటలు, విత్తనాలు, ఎరువుల వాడకం వంటి సమాచారంతో బ్రోచర్లు, కరపత్రాలను కలెక్టర్ విడుదల చేశారు. ఉత్తమ రైతులను సన్మానించారు. జిల్లా వ్యవసాయ అధికారిణి ఎ.లక్ష్మి, ఆత్మ పీడీ జి.వెంకటేశ్వరావు, పశు సంవర్ధక శాఖ జేడీ డి.వేణుగోపాల్, ఏపీఎంఐపీ పీడీ డి.నీలిమ, ఉద్యాన శాఖ డీడీ ఖలీం, మార్క్‌ఫెడ్ డీఎం కరుణశ్రీ , పౌర సరఫరాల శాఖ డీఎం ఎం. శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


