కట్టను చెరబట్టి మట్టి దందా కొల్లూరు: పశ్చిమ బ్యాంక్ కెనాల్‌లో మట్టి దందా అడ్డగోలుగా సాగుతోంది. ప్రకాశం బ్యారేజ్ నుంచి చీలి గుంటూరు జిల్లా రేవేంద్రపాడు వద్ద ఈ కాలువ మొదలవుతుంది. అక్కడ నుంచి బాపట్ల జిల్లా కొల్లూరులు వద్దకు వస్తుంది. ఆ తర్వాత రేపల్లె తదితర ప్రాంతాలకు పలు పిల్ల కాలువల ద్వారా మాగాణి భూములుకు చేరుతుంది. దీని పరిధిలో దాదాపు 4 లక్షల ఎకరాలకు సాగునీటితో పాటు తాగు నీరు కూడా అందుతుంది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ కాలువను ధ్వంసం చేస్తున్నారు.
కొల్లూరులో కాలువల అభివృద్ధి నెపంతో టీడీపీ నాయకులు కాలువలో పూడికల తొలగింపు మమ అనిపిస్తూ.. దిబ్బల మట్టిని సొంత అవసరాలకు, తమ అనుయాయులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. బాపట్ల, ప్రకాశం జిల్లాలకు సాగు, తాగు నీటికి జీవనాడిగా ఉన్న పశ్చిమ బ్యాంక్ కెనాల్‌కు నష్టం జరిగేలా కొల్లూరులో సోమవారం రాత్రి కాలువ ఎడమ గట్టు కట్టలు చెదరగొట్టి మట్టి దొంగతనం మొదలుపెట్టారు. లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందించే కెనాల్‌లోనే అక్రమంగా తవ్వి మట్టి తరలిస్తున్నారంటే రాష్ట్రంలో పాలన ఎంత గాడి తప్పిందో అర్థం చేసుకోవచ్చు. ఇరిగేషన్ కార్యాలయం సమీపంలోనే అక్రమ తవ్వకాలు, వందల ఏళ్ల నాటి చెట్లు నరికి కలప అమ్ముకోవడం వెనుక నీటిపారుదల శాఖ అధికారుల ప్రమేయం ఉందన్న అనుమానాలు వస్తున్నాయి.
ఓ విశ్రాంత ఉద్యోగి సదరు టీడీపీ నాయకుడి వత్తాసుతో కాలువలో మట్టి తవ్వడం, కట్టలు తొలగించి మట్టిని తరలించి కరకట్ట వెంబడి తన ఆధీనంలో ఉన్న పొలాన్ని విస్తరించడానికి వినియోగించడంపై విస్మయం వ్యక్తం అవుతోంది. పశ్చిమ బ్యాంక్ కెనాల్ జిల్లాలోకి ప్రవేశించే ఆరంభంలోనే కాలువ మనుగడకు ముప్పు వాటిల్లేలా కట్టలు తొలచి మట్టి తవ్వకాలు చేపట్టడం, అంచుల వెంబడి శతాబ్దాల చరిత్ర ఉన్న భారీ వృక్షాలను నరికించి, క్రేన్ సాయంతో తరలించి అమ్ముకోవడంతో కాలువ పటిష్టత మరింత ప్రశ్నార్థకంగా మారింది.
పశ్చిమ బ్యాంక్ కెనాల్ వద్ద మట్టి తవ్వకాలు
ప్రశ్నార్థకంగా లక్షల ఎకరాల్లో సాగు భవితవ్యం
భారీ యంత్రంతో కాలువలో మట్టి తవ్వకాలు
టీడీపీ నేతకు ఇరిగేషన్ అధికారుల అండ?
బలహీన పడుతున్న కాలువ కట్ట
వందల ఏళ్ల నాటి వృక్షాలూ మాయం
నీటిపారుదల శాఖ కార్యాలయం సమీపంలోనే తతంగం
కట్టలు సరిచేయాలని చెప్పాం
కాలువలో మట్టి తవ్వుకొని తరలించడానికి చెదరగొట్టిన కట్టలను సరిచేయాలని సంబంధిత వ్యక్తికి సూచించాం. పొలంలో మెరక కోసం కాలువలో మట్టి వరకు తీసుకుంటానని అతను చెప్పడంతో ఒప్పుకున్నాం.
అధికారమే అండగా...
భద్రత ప్రశ్నార్థకం
పంట పొలాల చుట్టూ మట్టి అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. చివరకు లక్షలాది ఎకరాల ఆయకట్టుకు నీరందించే కాలువపైనా కన్నేశారు. నీటి పారుదల శాఖలో ఇంటి దొంగల అండతో ఏకంగా కాలువ కట్టల అంచులను తవ్వి మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకొంటున్నారు. వీరి దెబ్బకు కాలువ రూపురేఖలు మారిపోతున్నా.. కొల్లూరు మండలానికి చెందిన ఓ టీడీపీ నాయకుడి సిఫార్సులతో దందా యథేచ్ఛగా సాగిపోతోంది. కొల్లూరు నీటి పారుదల శాఖ కార్యాలయం సమీపంలోనే ఈ అక్రమం సాగుతున్నా అధికారులు నిద్రపోతున్నారు.
– రవిబాబు, ఇరిగేషన్ ఇన్‌చార్జి ఏఈ