ప్రస్తుతం మున్సిపాల్టీలో పన్నుల వసూళ్లలో చూపించిన శ్రద్ధ, చొరవ ప్రజలకు కనీస వసతులు కల్పించడంలో చూపించడం లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంటిపన్నులను ఆస్తివిలువతో ముడిపెట్టి విధించడం సరికాదు. ఇంటిపన్నులు ఎప్పుడూ రెంటల్ విధానంలోనే ఉండాలి. ప్రతి ఆరు నెలలకు పన్నులు పెంచడం సరికాదు. పట్టణంలో 12 కి.మీ మేరా ఉన్న డ్రైనేజిను కనీసం క్లీనింగ్ చేసే నాధుడే లేడు. ఏ వీధిలో చూసినా చెత్తాచెదారం నిల్వలు పేరుకుపోతున్నాయి.
– డి. చంద్రయ్యశర్మ,
మాజీ మున్సిపల్ కౌన్సిలర్


